Share News

Air India: సిబ్బంది లాంగ్ సిక్ లీవ్.. 80 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

ABN , Publish Date - May 08 , 2024 | 03:01 PM

ఎయిర్ ఇండియా(Air India) సిబ్బంది నిర్వాకంతో 80కిపైగా విమానాలు రద్దు అయ్యాయి. క్యాబిన్ సిబ్బంది అకస్మాత్తుగా సిక్ లీవ్స్ పెట్టడంతో విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి తమ సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురైయ్యారని తెలిపింది.

Air India: సిబ్బంది లాంగ్ సిక్ లీవ్.. 80 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా విమానయాన సిబ్బంది సెలవు పెడితే ఏం చేస్తారు. వారి స్థానంలో వేరే వారి సాయంతో విమానాలను యథావిధిగా నడిపిస్తారు. కానీ ఎయిర్ ఇండియా(Air India) ఎక్స్‌ప్రెస్ సిబ్బంది నిర్వాకంతో 80కిపైగా విమానాలు రద్దు అయ్యాయి. క్యాబిన్ సిబ్బంది అకస్మాత్తుగా సిక్ లీవ్స్ పెట్టడంతో విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.


మంగళవారం రాత్రి నుంచి తమ సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురైయ్యారని తెలిపింది. దీంతో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయని.. 80కిపైగా విమానాలను రద్దు చేశామని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. వారికి డబ్బులు తిరిగి ఇవ్వడం కానీ, విమానాలు రీ షెడ్యూల్ చేస్తామని వివరించింది.

మే 8వ తేదీన ప్రయాణాలు షెడ్యూల్ చేసుకున్న ప్రయాణికులు తాము ఇంటి నుంచి బయల్దేరే ముందే తమ విమానం క్యాన్సల్‌ అయిందో? లేదో? నిర్ధారించుకోవాలని సూచించింది.


సిబ్బంది, ప్రయాణికుల తీవ్ర అసంతృప్తి..

సిబ్బంది సిక్ లీవ్ పెట్టారనే కారణంతో విమానాలు రద్దు చేయడంపై ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్.. సంస్థపై విమర్శలు చేసింది. సంస్థ నిర్వహణ బాలేదని, సిబ్బంది మధ్య వివక్ష సాధారణమైపోయిందని ఆరోపించింది. విస్తారా ఎయిర్ లైన్స్ విలీనంపై కూడా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సిబ్బంది అసంతృప్తితో ఉన్నారు.

సంస్థ తీరు వల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని చెబుతున్నారు. విమానాల రద్దుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. సిబ్బంది సెలవులు పెట్టడం వల్ల విమానాలను రద్దు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 03:01 PM