Share News

Water Vs weight Loss: నీరు ఎక్కువ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంతంటే..!

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:38 PM

కేవలం ఆరోగ్యానికే కాదు.. బరువు తగ్గాలని అనుకునేవారు.. పొట్ట తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేవారు కూడా నీరు అధికంగా తాగుతుంటారు. అసలు నీరు ఎక్కువ తాగడం వల్ల బరువు నిజంగానే తగ్గుతారా? ఇందులో నిజమెంత? పరిశోధనలు దీని గురించి ఏం చెబుతున్నాయి?

Water Vs weight Loss: నీరు ఎక్కువ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంతంటే..!

నీరు శరీరానికి ఇంధనం లాంటిది. రోజూ కనీసం 8 గ్లాసుల నీరు లేదా 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని అంటారు. కేవలం ఇలా ఆరోగ్యానికే కాదు.. బరువు తగ్గాలని అనుకునేవారు.. పొట్ట తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేవారు కూడా నీరు అధికంగా తాగుతుంటారు. అసలు నీరు ఎక్కువ తాగడం వల్ల బరువు నిజంగానే తగ్గుతారా? ఇందులో నిజమెంత? పరిశోధనలు దీని గురించి ఏం చెబుతున్నాయి? తెలుసుకుంటే..

నీటిని తాగడం వల్ల కేలరీలను బర్న్ చేయడంలో, ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. తియ్యటి పానీయాలకు బదులుగా నీటిని తాగడం వల్ల కేలరీలు, చక్కెర తీసుకోవడం తగ్గించవచ్చు. కానీ బరువు తగ్గడానికి నీరు సహాయపడుతుందని తగినంత ఆధారాలు లేవని పరిశోధకులు, వైద్యులు అంటున్నారు. చాలా రోజుల నుండి త్రాగునీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని నమ్ముతున్నారు. గత కొన్నేళ్ల నుండి జరుగుతున్న అధ్యయనాల ప్రకారం ఎక్కువ నీరు త్రాగడం వల్ల బరువు తగ్గవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే దీనికి సరైన ఆధారాలు మాత్రం లేవు.

రాత్రి 7గంటలలోపు డిన్నర్ ఎందుకు చేయాలో చెప్పే బలమైన కారణాలివీ..!


బరువు తగ్గడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే దీనికోసం రోజు మొత్తం నీరు తాగాలని కాదు. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. బరువు తగ్గుతాం అనే పిచ్చి ఆలోచనతో నీరు ఎడాపెడా తాగేస్తుంటారు. కానీ ఇలా చేస్తే మూత్రపిండాలపై చెడు ప్రభావం పడుతుంది. దీని కారణంగా శరీరంలో సోడియం స్థాయిలు మందగిస్తాయి. ఇది శరీరంలోని ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బ తినడం వల్ల ఇది హైపోనట్రేమియా వ్యాధి వస్తుంది. ఇది ఆకస్మిక మరణాల ప్రమాదం పెంచుతుంది. అందువల్ల అవసరమైనంత లేదా దాహం అనిపించినప్పుడు మాత్రమే నీరు తాగడం మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు. అనవసరంగా బలవంతంగా నీరు త్రాగడానికి ప్రయత్నించవద్దని సలహా ఇస్తున్నారు.

30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!

10వ తరగతి ఫలితాల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 30 , 2024 | 02:38 PM