Share News

Health Tips: క్రమం తప్పకుండా దనియాలు, జీలకర్ర నీటిని తాగితే జరిగేదేంటి? ప్రాచీన వైద్యం దీని గురించి ఏం చెప్తోందంటే..!

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:02 PM

జీలకర్ర, దనియాలు నీటిలో ఉండే పోషకాలేంటి? దీన్ని వాడితే జరిగే మ్యాజిక్ ఏంటి?

Health Tips: క్రమం తప్పకుండా దనియాలు, జీలకర్ర నీటిని తాగితే జరిగేదేంటి? ప్రాచీన వైద్యం దీని గురించి ఏం చెప్తోందంటే..!

దనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు.. ఇలా వంటింట్లో ఉండే బోలెడు దినుసులను ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది దనియాల నీరు, జీలకర్ర నీరు వాడటం చూసి ఉంటారు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ గురించి తెలిసిన వారు తక్కువ. దనియాలు, జీలకర్ర రెంటింటిని నీటిలో ఉడికించి ఆ నీటిని క్రమం తప్పకుండా తాగుతుంటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయని ప్రాచీన వైద్యం చెబుతోంది. ఎందుకంటే ప్రాచీన కాలంలోనే ఈ పానీయాన్ని బరువు తగ్గడం కోసం.. ముఖ్యంగా పొట్ట, నడుము భాగంలో కొవ్వు తగ్గించుకోవడం కోసం ఉపయోగించారు. ఇంతకీ ఈ జీలకర్ర, దనియాలు నీటిలో ఉండే పోషకాలేంటి? దీన్ని వాడితే జరిగే మ్యాజిక్ ఏంటి? తెలుసుకుంటే..

జీలకర్ర, దనియాలు నీటిని తాగితే సహజంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఈ రెండింటిలోనూ డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉండటం వల్ల ఇవి శరీరంలో టాక్సిన్లు బయటకు పంపుతాయి. కాలేయం సమర్థవంతంగా పనిచేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత ఆరోగ్యకరంగా ఉంటుంది. దీని వల్ల కలిగే ఇతర లాభాలేంటంటే..

ఇది కూడా చదవండి: వేసవిలో పొరపాటున కూడా తినకూడని 8 మసాలాలు ఇవీ..!


దనియాలు, జీలకర్ర నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. మెటబాలిజం బూస్ట్ అవుతుంది. శరీరంలో అదనపు కేలరీలు బర్న్ చేయడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.

ఆకలిని నియంత్రించడం ద్వారా దనియాలు, జీలకర్ర నీరు రోజూ శరీరంలోకి వెళ్లే కేలరీలను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.

ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గించడంలో కూడా దనియాలు, జీలకర్ర నీరు సహాయపడుతుంది. శరీరంలో నీరు అదనంగా చేరి బరువు ఎక్కువ కనిపించే ప్రక్రియకు చెక్ పెడుతుంది.

యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఆర్థరైటిస్, దానికి సంబంధించిన ఇతర సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. పేగు వ్యాధి వంటి తాపజనక పరిస్థితులను కూడా తగ్గిస్తుంది.

శరీరంలో ఉండే టాక్సిన్లను తొలగించడంలో ఈ నీరు సహాయపడుతుంది. ఈ కారణం వల్ల ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం శుద్ది అవుతుంది.

ఈ నీరు ఎలా చేసుకోవాలంటే..

టేబుల్ స్పూన్ దనియాలు

టేబుల్ స్పూన్ జీలకర్ర

4 కప్పుల నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. 10-15 నిమిషాలు ఉడికిన తరువాత కొంచెం సేపు పక్కన ఉంచాలి. గోరువెచ్చగా ఉన్నట్టే ఇందులో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. అయితే మూత్ర సంబంధ సమస్యలున్నవారు ఈ నీటిని తాగకపోవడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 12:02 PM