Share News

Cool Water: వేసవికాలంలో చల్లని నీరు తాగడానికి ఇష్టపడుతున్నారా? ఇది ఎంతవరకు మంచిదో తెలుసా?

ABN , Publish Date - May 03 , 2024 | 03:43 PM

చాలామంది ఎండలో నుండి ఇంటికి వచ్చినా, సాధారణంగా దాహంగా అనిపించినా చల్లని నీరు తాగుతుంటారు. నిజానికి ఈ ఎండల వేడికి చల్లని నీరు తాగితే ప్రాణం లేచొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇలా చల్లని నీరు తాగడం ఎంత వరకు ప్రయోజనకరమో తెలుసుకుంటే..

Cool Water: వేసవికాలంలో చల్లని నీరు తాగడానికి ఇష్టపడుతున్నారా? ఇది ఎంతవరకు మంచిదో తెలుసా?

ప్రస్తుతం అన్నిచోట్లా ఎండలు మండిపోతున్నాయి. శరీరం చాలా తొందరగా డీహైడ్రేషన్ కు గురవుతోంది. ప్రతిరోజూ కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు క్రమం తప్పకుండా తాగాలని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలామంది ఎండలో నుండి ఇంటికి వచ్చినా, సాధారణంగా దాహంగా అనిపించినా చల్లని నీరు తాగుతుంటారు. నిజానికి ఈ ఎండల వేడికి చల్లని నీరు తాగితే ప్రాణం లేచొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇలా చల్లని నీరు తాగడం ఎంత వరకు ప్రయోజనకరమో తెలుసుకుంటే..

చల్లటి నీరు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఏ అధ్యయనాల్లోనూ ఏమీ వెల్లడించలేదు. చాలా సార్లు చల్లటి నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పటి వరకు చల్లటి తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని రుజువు చేసే ఏ అధ్యయనం కూడా బయటికి రాలేదు. చల్లని, సాధారణ నీరు రెండూ వేసవిలో హైడ్రేట్ గా ఉంచుతాయి.

అనీమియా ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇవే..!


వేసవిలో చల్లటి నీరు లేదా గోరువెచ్చని నీరు తాగినా ఎలాంటి నష్టం లేదు. అయితే శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. శరీరం హైడ్రేట్ గా ఉంటే అది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. సరైన హైడ్రేషన్‌ను నిర్వహించడానికి, డీహైడ్రేషన్ నుండి దూరంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది. హైడ్రేషన్ శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉండటంలో సహాయపడుతుంది. రిఫ్రిజిరేటర్ నుండి చల్లటి నీరు త్రాగినా కొన్ని సందర్భాలలో అది గొంతుపై ప్రభావం చూపుతుంది. కానీ ఇది ఎటువంటి ఆరోగ్య ప్రభావాలను కలిగించదు.

ఈ ఆహారాలు తిన్నారంటే చాలు.. ఆరోగ్యకరమైన కీళ్లు మీ సొంతం..!

అనీమియా ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 03 , 2024 | 03:43 PM