ఈ ఆహారాలు తిన్నారంటే చాలు.. ఆరోగ్యకరమైన కీళ్లు మీ సొంతం..!

ఫ్యాటీ ఫిష్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి కీళ్లకు మంచివి.

బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు మొదలైన వాటిలో  ఒమెగా-3 ప్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కీళ్ల ఆరోగ్యానికి మంచివి.

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీస్, బ్లాక్బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కీళ్ల వాపును, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

బచ్చలికూర, పాలకూర, ఇతర ఆకుకూరలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల కణజాలానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.

బ్రోకలిలో సల్పోరాఫేన్ అధికంగా ఉంటుంది.  ఇది కీళ్ల సమస్యలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

పసుపులో ఉండే కర్కుమిన్ కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది.

అల్లంలో ఉండే జింజెరాల్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో,  కీళ్ల పట్టుత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లిలో డయల్ డైసల్పైడ్ అనే సమ్మేళనం కీళ్లలో మృదులాస్థి నష్టాన్ని తగ్గించి కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గ్రీన్ టీ లో  పాలీ ఫెనాల్స్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి కీళ్ల కణజాలం దెబ్బతినకుండా రక్షిస్తాయి.