Share News

Back Pain: అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఇంట్లోనే ఈజీగా దీన్నెలా తగ్గించుకోవచ్చంటే..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:47 PM

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చాలామందికి వెన్నునొప్పి మొదలవుతుంది. కానీ ఇప్పట్లో చిన్న వయస్సులోనే వెన్నునొప్పితో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అసలు వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది? ఇంట్లోనే దీన్ని ఈజీగా తగ్గించుకునే మార్గం ఏంటంటే..

Back Pain: అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఇంట్లోనే ఈజీగా దీన్నెలా తగ్గించుకోవచ్చంటే..!

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చాలామందికి వెన్నునొప్పి మొదలవుతుంది. కానీ ఇప్పట్లో చిన్న వయస్సులోనే వెన్నునొప్పితో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చాలావరకు ఈ నొప్పి ఎక్కువగా నడుము కింది భాగంలో వస్తుంది. వెన్నునొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ దీనికి పరిష్కారం కోసం ఎక్కువగా వైద్యుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది? ఇంట్లోనే దీన్ని ఈజీగా తగ్గించుకునే మార్గం ఏంటి తెలుసుకుంటే...

వెన్ను నొప్పి ఇప్పట్లో చాలా సాదారణ సమస్యగా మారింది. రోజువారీ పని విషయంలో అనారోగ్యకరమైన శైలి, సరైన పొజిషన్లో కూర్చోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఏదైనా గాయం, భారీ లేదా తీవ్రమైన వ్యాయామం చేయడం. పోషకాలు, విటమిన్ డి లోపం. కాల్షియం లోపం. స్థూలకాయం, కండరాల ఒత్తిడి లేదా బరువున్న వస్తువులను ఎత్తడం మొదలైన చాలా కారణాలున్నాయి.

ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!


ఇంట్లోనే వెన్ను నొప్పికి చిట్కాలు..

పొజిషన్..

వెన్ను నొప్పికి ఉన్న ప్రధాన కారణాలలో పొజిషన్ సరిగా లేకపోవడం కూడా ఒకటి. కూర్చునే పొజిషన్ సరిగా ఉందా లేదా చూసుకుని దాన్ని సరిచేసుకోవాలి. ఒకవైపు వంగి ఉండటం, వంగి కూర్చోవడం, పక్కకు వంగి నడవడం వంటివి గమనించుకుని దాన్ని సరిచేసుకోవాలి.

చల్లని, వేడి కాపడం..

నడుము నొప్పి వచ్చినప్పుడు చల్లని లేదా వేడి కాపడం పెట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. నడుము వాపును తగ్గిస్తుంది. అయితే ఐస్ ప్యాక్ వేసేటప్పుడు నేరుగా మంచును నడుము మీద పూయకూడదని గుర్తుపెట్టుకోవాలి.

మసాలా దినుసులు..

వెన్నునొప్పిని తగ్గించే కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా పసుపు, అల్లం తీసుకోవడం వల్ల వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రెండింటిలోనూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి వాపును తగ్గిస్తాయి. పసుపు లేదా అల్లం టీ తాగవచ్చు.

ఈ కుక్క జాతులు సింహాన్ని సైతం చంపగలవు..!


స్ట్రెచింగ్..

రోజూ కొంత సేపు వ్యాయామం చేయడం ద్వారా వెన్నునొప్పికి దూరంగా ఉంచవచ్చు. ఇది శరీరం ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. నడుముతో పాటు హిప్స్, హామ్ స్ట్రింగ్స్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది.

బరువు..

బరువు పెరగడం కూడా వెన్నునొప్పికి కారణమవుతుంది. ఊబకాయం వెన్నెముకపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. వెనుక కండరాలు కూడా సాగదీయబడతాయి. మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయవచ్చు. దీని కారణంగా నొప్పి కూడా తగ్గుతుంది.

ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!

ఈ కుక్క జాతులు సింహాన్ని సైతం చంపగలవు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 29 , 2024 | 03:47 PM