Share News

Boat Capsized: నదిలో పడవ బోల్తా నలుగురు మృతి, పలువురి గల్లంతు

ABN , Publish Date - Apr 20 , 2024 | 09:44 AM

50 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ(boat) ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, అదే సమయంలో ముగ్గురి కంటే ఎక్కువ గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఒడిశా(Odisha)లోని జార్సుగూడ జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 19) సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

 Boat Capsized: నదిలో పడవ బోల్తా నలుగురు మృతి, పలువురి గల్లంతు
Boat capsized in Mahanadi river Odishas Jharsuguda

50 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ(boat) ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, అదే సమయంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఒడిశా(Odisha)లోని జార్సుగూడ జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 19) సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఈ ప్రమాద ఘటనపై ఒడిశా రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ వెంటనే స్పందించారు. వారి మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయా కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. దీంతోపాటు రక్షించిన వారికి సరైన చికిత్స అందించాలని సీఎం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.


పథర్సేని కుడా నుంచి బర్గర్ జిల్లాలోని బంజిపల్లికి బోటు 50 మంది ప్రయాణికులతో(passengers) వెళ్తుంది. ఆ క్రమంలో జార్సుగూడ జిల్లా రెంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా ఘాట్ వద్దకు పడవ చేరుకోగానే బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న మత్స్యకారులు శుక్రవారం సాయంత్రం నీటిలో నుంచి 35 మందిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు(police), అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరికొంత మందిని రక్షించారు. శనివారం ఉదయం వరకు దాదాపు 45 మందిని రెస్క్యూ టీమ్ రక్షించారు.


మరోవైపు ఇటివల కశ్మీర్‌(kashmir) శ్రీనగర్‌లోని జీలం నది(jhelum river)లో మంగళవారం (ఏప్రిల్ 16) ఉదయం పడవ బోల్తా పడింది. ఈ పడవలో 15 మంది ఉన్నారని, అందులో 7 మంది పాఠశాల విద్యార్థులు, 8 మంది ఉన్నారని శ్రీనగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. ఆరుగురిని రక్షించగా, ముగ్గురు గల్లంతయ్యారు. వర్షాకాలం రాకముందే పరిస్థితి ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లో రానున్న వర్షాకాలం సమయంలో పడవల్లో ప్రయాణించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇది కూడా చదవండి:

IPL 2024: నేడు DC vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే


IPL 2024: చెన్నై ఓటమికి కారణాలు చెప్పిన కెప్టెన్.. లక్నో గ్రాండ్ విక్టరీ


మరిన్ని క్రైం వార్తల కోసం

Updated Date - Apr 20 , 2024 | 10:13 AM