Share News

వచ్చేస్తున్నాం..ఓట్ల పండక్కి..

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:52 PM

ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఊళ్లకు వచ్చేందుకు ఇప్పటికే రైళ్లకు అడ్వాన్స్‌గా రిజర్వేషన్‌ చేయించు కున్నారు. మరికొందరు వాహనాల్లో వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

వచ్చేస్తున్నాం..ఓట్ల పండక్కి..

రైళ్లన్నీ ఫుల్‌..

నరసాపురం, ఏప్రిల్‌ 28: ఐదేళ్లకు ఒకసారి వచ్చే పండుగ ఎన్నికలు...భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించు కునేందుకు ప్రతి ఓటర్‌ ఆసక్తి చూపుతాడు. పండుగలకు వచ్చినా రాకపోయినా... ఓటు వేసేందుకు మాత్రం కచ్చితంగా స్వగ్రామాలకు వస్తుంటారు. చాలామంది ఉద్యోగాల రీత్యా ఇతర రాష్ర్టాల్లో ఉన్నప్పటికీ తమ ఓటును మాత్రం స్వగ్రామంలోనే ఉంచుకున్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు స్ధానికంగా ఉన్న చాలామంది తమ ఓటు రద్దు కాకుండా చూసుకున్నారు. దీంతో వీరంతా ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఊళ్లకు వచ్చేందుకు ఇప్పటికే రైళ్లకు అడ్వాన్స్‌గా రిజర్వేషన్‌ చేయించు కున్నారు. మరికొందరు వాహనాల్లో వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

రైళ్లలో దొరకని టిక్కెట్లు

అంతా రైళ్లకే రిజర్వేషన్లు చేయించుకోవడంతో జిల్లా మీదుగా నడిచే అన్ని ఎక్స్‌ప్రెస్స్‌ రైళ్లు నిండుకున్నాయి. ప్రధానంగా హైద్రాబాద్‌ నుంచి వచ్చే ఓటర్లు ఎక్కువుగా ఉండటంతో వచ్చే 10,11 తేదీల్లో జిల్లా మీదుగా నడిచే నరసాపూర్‌, గౌతమి, గోదావరి వంటి ప్రధాన ఎక్స్‌ప్రెస్స్‌ల్లో వెయిటింగ్‌ లిస్టు 500 దాటి నో రూమ్‌ చూపిస్తున్నది. తిరుగు ప్రయాణంలో 13,14 తేదీల్లో ఇదే పరిస్థితి ఉంది. ఏసీ కోచ్‌ల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో టిక్కెట్లు దొరకని మరింత కొంత మంది ప్రత్యేక రైళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు.

రిజర్వేషన్‌ పరిస్థితికి కొస్తే నరసాపురం ఎక్స్‌ప్రెస్‌లో 10న స్లీపర్‌ క్లాస్‌లో 395, 11న నో రూమ్‌, 12న 302 వెయిటింగ్‌ లిస్టు ఉంది, ఇక ఏసీ త్రీటైర్‌లో 10, 11 తేదీల్లో నో రూమ్‌ చూపిస్తున్నది. 12న 105 వెయింటిగ్‌ లిస్టు ఉంది. తిరుగు ప్రయాణంలో 13 వ తేదీన నో రూమ్‌, 14న 306 స్లీపర్‌ క్లాస్‌ ఉంది. ఈ రెండు తేదీల్లో ఏసీ నో..రూమ్‌ చూపిస్తున్నది.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌లో 10న 260, 11న 307, 12న 215 వెయిటింగ్‌ లిస్టు ఉంది. ఏసీలో 10న 148, 11న 135, 12న 214 వెయిటింగ్‌ లిస్టు ఉంది. తిరుగు ప్రయాణంలో 13న స్లీపర్‌లో నో రూమ్‌, 14న , 15 తేదిల్లో వెయిటింగ్‌లిస్టు 300, 190 ఉంది.

గౌతమిలో 10, 11 తేదిల్లో నో రూమ్‌ చూపిస్తున్నది. 12న 430 వెయిటింగ్‌ లిస్టు ఉంది. ఏసీ విషయానికి వస్తే 10న 150, 11న 136, 12న 90 ఉంది, ఇక తిరుగు ప్రయాణంలో 13న స్లీపర్‌లో వెయిటింగ్‌ లిస్టు 326, 14న 246, 15న 157 ఉంది. ఏసీలో వెయిటింగ్‌లిస్టు ఈ మూడు రోజుల్లో 100 పైబడే ఉంది. ఇదే పరిస్థితి సిక్రింద్రాబాద్‌ నుంచి నరసాపురం వరకు నాగర్‌ సోల్‌ ఎక్స్‌ప్రెస్స్‌, భీమవరం, తణుకు మీదుగా నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్స్‌కు కూడా కనిపిస్తుంది.

Updated Date - Apr 28 , 2024 | 11:52 PM