Share News

టిడ్కో ఉచిత ఇళ్లను మరిచారా?

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:25 AM

ఏపీ టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామంటూ గత ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే రుణాలు చెల్లిస్తుంది. ఇది మీ జగనన్న హామీ అంటూ భీమవరంలో ప్రకటించారు. కానీ ఎన్నికల హామీని నెరవేర్చలేకపోయారు.

టిడ్కో ఉచిత ఇళ్లను మరిచారా?

సీఎం జగన్‌ ఇచ్చిన హామీకి ఐదేళ్లు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఏపీ టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామంటూ గత ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే రుణాలు చెల్లిస్తుంది. ఇది మీ జగనన్న హామీ అంటూ భీమవరంలో ప్రకటించారు. కానీ ఎన్నికల హామీని నెరవేర్చలేకపోయారు. మళ్లీ ప్రస్తుత ఎన్నికల్లో భాగంగా బస్సు యాత్రలో సీఎంగా భీమవరం వస్తున్నారు. గతంలో జగన్‌ ఇచ్చిన హామీలను నియోజకవర్గ ప్రజలు నెమరు వేసుకుంటు న్నారు. ఇచ్చిన హామీని కాకుండా వైసీపీ ప్రభుత్వం కేవలం 300 చదరపు అడుగుల ఇళ్లకే పరిమితం చేసింది. అదే 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లకు రాయితీ వరకే పరిమితం చేశారు. ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. దీనివల్ల లబ్ధిదారులపై దాదాపు రూ.4.65 లక్షల భారం పడింది. బ్యాంకు రుణాలు చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో తెలుగుదేశం ప్రభు త్వం టిడ్కో ఇళ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లోనే 75 శాతం నిర్మాణం పూర్తయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షల వరకు రాయితీ ఇచ్చాయి. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేలా అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారులు తీసుకున్న రుణాల ను ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్‌ హామీ ఇచ్చారు. అఽధికారం లోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. మడమ తిప్పారు. కేవ లం 300 చదరపు అడుగుల ఇళ్లకు మాత్రమే ఉచితం అమ లుచేశారు. అంతేతప్ప 365, 430 చదరపు అడుగుల ఇళ్ల విష యంలో చేతులెత్తేశారు. లబ్ధిదారుల పేరుతో రుణాలు తీసుకు న్నారు. ఇళ్లు అందజేయకుండానే బ్యాంకుల నుంచి వాయిదా లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసే పరిస్థితి నెలకొంది.

టిడ్కో ఇళ్ల నిర్మాణం ఇలా..

ఏపీ టిడ్కో భీమవరంలో 8,352, పాలకొల్లులో 6,144 ఇళ్లు, తాడేపల్లిగూడెంలో 5,376 ఇళ్లు నిర్మిస్తున్నారు. అందులో 300 చదరపు అడుగుల ఇళ్లు 6,944 ఉన్నాయి. వాటికే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. అదే 365, 420 చదరపు అడుగులకు సంబంధించి మూడు పట్టణాల్లో 12,249 ఇళ్లు ఉన్నాయి. వారందరికీ ప్రభుత్వం ఉచిత హామీ నెరవేర్చలేదు. బ్యాంకు రుణాలు చెల్లించాల్సి వస్తోంది.

రంగులకే పరిమితం

వైసీపీ హయాంలో రంగులు మార్చేందుకు ప్రభుత్వం పరిమితమైంది. ఉన్న రంగులను మార్చింది. తెలుపు, నీలం రంగులు అద్దింది. ఇందుకు కోట్ల రూపాయలు వెచ్చింది. తెలుగుదేశం హయాంలో పూర్తి చేసిన ఇళ్లకు రంగులు మార్చడం వివాదాస్పదమైంది. తాడేపల్లిగూడెంలో 71 బ్లాక్‌లు, భీమవరంలో 32, పాలకొల్లులో 52 బ్లాక్‌లు టీడీపీ హయాం లోనే సిద్ధమయ్యాయి. ఒక్కో బ్లాక్‌లో 32 ఇళ్లు ఉన్నాయి. అప్పట్లోనే రంగులు వేశారు. అవి ఆకర్షణీయంగా ఉన్నాయి. సదరు ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు పట్టింది. ఆ తర్వాత మరో నాలుగు వేలు ఇచ్చారు. ఇప్పటికీ లబ్ధిదారులు ఆ ఇళ్లలోకి వెళ్లలేదు. పూర్తిస్థాయి వస తులు లేకుండానే లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించారు. వారి చేతిలో పట్టాలు పెట్టారు.

లబ్ధిదారుల వాటాలోనూ..

ప్రభుత్వం 365, 430 చదరపు అడుగులకు సంబంధించి లబ్ధిదారుల వాటాలో కొంత రాయితీ ఇస్తామని ప్రకటించింది. వాస్తవానికి 365 చదరపు అడగుల ఇళ్ల లబ్ధిదారులు రూ. 50 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు రూ.లక్ష వంతున చెల్లించారు. అందులో చెరి సగం ప్రభుత్వం తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అది కూడా నెరవేర్చలేదు. ఇలా వైసీపీ ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టింది. ఇప్పటికీ లబ్ధిదారుల వంతులో ప్రభుత్వం సొమ్ములు మంజూరు చేయలేదు. మరోవైపు బ్యాంకుల నుంచి లబ్ధిదారులపై ఒత్తిడి పెరుగుతోంది.

మంచినీరు కరువే

టిడ్కో ఇళ్లకు మంచినీటి వసతిని కల్పించలేదు. మున్సిపల్‌ పైప్‌లైన్‌లను గత ప్రభుత్వంలోనే పూర్తిచేశారు. ఇప్పటికీ వాటికి కనెక్షన్‌లు ఇవ్వలేదు. బోరు బావులపైనే టిడ్కో లబ్ధిదారులు ఆధారపడుతున్నారు. తాగునీటి కోసం మున్సిపాలిటీలు వాటర్‌ ట్యాంక్‌లను పంపుతున్నాయి. అవి కూడా అరకొరగా వస్తున్నాయంటూ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉచిత హామీని నెరవేర్చలేకపోయింది.

శ్రావణంలో గృహ ప్రవేశం : చంద్రబాబు

తెలుగుదేశం అధికారంలోకి వస్తే శ్రావణ మాసంలోనే ఇళ్లల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాలకొల్లు సభలో హామీ ఇచ్చారు. వాస్తవానికి క్రీడా మైదానాలు, పార్క్‌లు వంటివి ఏర్పాటు చేయాలని టీడీ పీ సంకల్పించింది. అవన్నీ వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తర్వా త తుంగలో తొక్కారు. కనీస వసతులు కల్పించలేకపో యా రు. టిడ్కో ఇళ్లు చిట్టడవులను తలపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికల సభకు సీఎం జగన్‌ వస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ లబ్ధిదారులు ఘొల్లుమంటున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:25 AM