Share News

రియల్‌గా కూల్చేశారు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:18 AM

గత ఐదేళ్లుగా భూక్రయ, విక్రయాలు బోల్తా పడ్డాయి. యజమానులు నిండా మునగ్గా కొనుగోలు దారులది అదే పరిస్థితి. రిజి స్ర్టేషన్‌ చార్జీలను ఎడాపెడా పెంచేశారు.

 రియల్‌గా కూల్చేశారు

స్తంభించిన క్రయ విక్రయాలు

వీధిన పడిన వందలాది మంది..

త్రిశంకు స్వర్గంలో భూ యజమానులు

ప్రధాన పట్టణాల్లోనూ వెంచర్లు ఆగమాగం

ఇదంతా జగన్‌సర్కార్‌ చిత్రవిచిత్రాలే కారణం

గత ఐదేళ్లుగా భూక్రయ, విక్రయాలు బోల్తా పడ్డాయి. యజమానులు నిండా మునగ్గా కొనుగోలు దారులది అదే పరిస్థితి. రిజి స్ర్టేషన్‌ చార్జీలను ఎడాపెడా పెంచేశారు. మధ్యలో కరోనా వచ్చి లావాదేవీలు నిలిచిపోయాయి. గడిచిన రెండున్నర ఏళ్లలో నిర్దేశించిన ప్రాంతాల్లో 25 శాతం రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెంచినా ఎవరూ కోలుకోలేదు. రిజిస్ర్టేషన్‌ శాఖ అనుకున్న ఆదాయ లక్ష్యాలు చేరినా భూవ్యవహా రాలన్నీ బోల్తా కొట్టాయి. దీనికి అంతా వైసీపీ తీరే కారణం. స్పష్టత లేని నిర్ణ యాలు, కేవలం కొందరికే కలిసొచ్చేలా మరికొన్ని నిర్ణయాలతో రియల్‌ రంగం అల్లకల్లోలంగా మారింది.

(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

రాష్ట్రంలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ 2009 నుంచి 2019 వరకు క్రయ,విక్రయాలు అద్భుతంగా సాగాయి. భూమి ధర పెరగడంతో ఆ మేరకు బ్యాంక ర్లు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడేవారే కాదు. చిన్నా చితక అవసరాలకు భూములను తాకట్టు పెట్టి గట్టెక్కిన కుటుంబాలు ఎన్నో. ఏపీ విభజన తర్వాత తగ్గుతుంది అనుకున్న రియల్‌ ఎస్టేట్‌ జోరు తగ్గకపోగా కాస్తంత పెరిగింది. కాని వైసీపీ ఈ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ భూములే కాదు, విలువైన వాణిజ్య భూముల లావా దేవీలు ఆకస్మికంగా నిలిచి పోయాయి. ఈ ప్రభావం కాస్త అన్ని కుటుంబాల మీద పడింది. ఓ వైపు తెలం గాణలోని హైదరాబాద్‌లో భూముల ధరలు చుక్కలను అంటగా, అదేసమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భూముల ధరల్లో క్షీణత చోటు చేసుకుంది.

ఏలూరు చుట్టుపక్కల ఎకరా ఒక్కింటికి ఒకానొక దశలో మూడు నుంచి రూ.4కోట్లు ధర పలికింది. ఏలూరులో గజం ఒక్కింటికి చొప్పున భీమవరంలో సెంటు ఒక్కింటికి చొప్పున క్రయ,విక్రయాలు సాగేవి. ఒకానొక దశలో భీమవరంలో సెంటు కోటి రూపాయల ధర పలికిన సందర్భాలు ఉన్నాయి. మెట్టప్రాంతమైన జంగారెడ్డిగూడెం వంటి పరిసరాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. పాలకొల్లు, తణుకు వంటి పట్టణాల్లో చెప్పనక్కర్లేదు. ఇదంతా 2020కి ముందు ఆ తర్వాత భూముల కొనుగోళ్లలో ప్రతిష్ఠంభన నెలకొంది. ఎందు కంటే కరోనా తర్వాత ఒక్కసారిగా నగదు లావాదేవీలు పెనుమార్పే జరిగింది. దీనికి తోడు ప్రభుత్వ నిర్ణయా లు, ఇంకోవైపు అధికార పార్టీ భూములపై దొంగ చూపులు. ఎక్కడ విలువైన భూములు కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోవడం, ఏదో రూపంలో యజమానులను బెదిరించడం తక్కువ ధరకే సొంతం చేసుకునే ప్రయ త్నాలు రాష్ట్రవ్యాప్తంగా వరుసగా చోటు చేసుకున్న దరిమిలా అసలు భూముల అమ్మకాలకు వెళ్లకుండా ఉంటే కనీసం భూమైనా భద్రతగా ఉంటుందని యజమానులు భావించారు. ఈ కారణంతోనే ఒకప్పుడు భారీగా సాగిన రియల్‌ వ్యాపారం కుప్పకూలింది.

ఆదాయం పెంచుకునే ఎత్తుగడ..

అయితే 2023 తర్వాత ఆదాయం పడిపోయిందని చెప్పి ఒక్కసారిగా రెట్టింపు చేసుకునేందుకు సర్కార్‌ ఎత్తుగడ వేసింది. దీంతో పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాలు ముఖ్య గ్రామాలు పరిసరాలు అన్నింటిలోనూ 25 శాతం మేర భూమి విలువలను పెంచేశారు. యజమానులు కొంత సంతోషపడినా ఆ తర్వాత భూమి కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒక్కసారిగా కుదేలైయ్యారు. అయితే పట్టణ ప్రాంతాల్లో నిరుపేద లకు ఇచ్చే సెంటున్నర స్థలం విలువ రూ.5 నుంచి రూ.8 లక్షలు ఉందంటూ జగన్‌ సర్కార్‌ అందర్ని బుట్టలో వేసింది. కేవలం ఒక పంటకే ఆధారమైన పంటచేలను జగనన్న కాలనీ నిమిత్తం లక్షలు ఖర్చు చేసి భూములు కొన్నారు. కేవలం ఇది కృత్రిమ ధర మాత్రమే. కమిషన్లు నొక్కేయడానికి మాత్రమే ఇది పనికొచ్చింది. ప్రధాన పట్టణాల్లో ఉన్న భూముల ధరలు సర్కార్‌ లెక్కల ప్రకారమే కోట్లు విలువ చేసినా కొనుగోలుకు నిరాసక్తత ఎదురవ్వడంతో అంతా బోల్తా కొట్టింది. ఉదాహరణకు ఏలూరు నగరంలో నడిబొడ్డున ఉన్న ఒక కీలక ప్రాంతంలో కేవలం 125 గజాల స్థలం రూ.2కోట్లు ధర పలికింది. కాని ఈ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ముందస్తుగా ఎవరూ ధైర్యం చేయలేదు. చివరికి ఆ స్థలాన్ని కోటి రూపాయలల్లోపే తెగ నమ్ముకోవాల్సి వచ్చింది. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని నమ్ముకుని వందలాది మంది నిరుద్యోగులు నిత్యం శ్రమించేవారు. ఎప్పుడైతే లావాదేవీలు స్తంభించాయో, రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలింది. దీంతో అంతోఇంతో సంపాదించుకునే నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. భీమవరం శివార్లలో కాస్త సంతృప్తిగా భూమి కలిగిన ఒక రైతు రెండున్నర ఏళ్ళ క్రితమే ఈ రియల్‌ ఎస్టేట్‌ ను నమ్ముకుని వెంచర్‌ వేశారు. కాని మార్కెట్లో స్పందన రాలేదు. ఫలితంగా 50 శాతం కూడా అమ్మ కాలు లేక నిలువునా ఠారెత్తిపోయారు. జంగారెడ్డిగూడెం పరిసరాల్లో రియల్‌వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగింది. ప్రైవేట్‌ ల్యాండ్స్‌ కొనుగోలుకు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి రోజూ పెద్దసంఖ్యలో కొను గోలు దారులు వచ్చిపోతా ఉండేవారు. ఎప్పుడైతే ఇక్కడి భూముల ధరలు పడిపోయానని సంకేతాలు వచ్చాయో ఆ వెనువెంటనే వచ్చిన వారంతా వెనుతిరిగారు. గడి చిన రెండున్నరేళ్ళ క్రితం వేసినా దాదాపు 180కి పైగా వెంచర్లు ఇప్పుడు లావాదేవీలు లేక కనిపిస్తున్నాయి. అధికారపార్టీలో ఉండి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే కొంతమంది అధికారాన్ని ఉపయోగించుకుని చేద్దామని ప్రయత్నించినా వారికి కూడా పనికాలేదు.

అస్తవ్యస్త విధానాలే దెబ్బతీశాయి

రాష్ట్ర సర్కార్‌ ఒక క్రమపద్ధతిలో కీలక నిర్ణయాలు తీసుకోలేక తప్పటడుగు వేసింది. భూముల రిజిస్ర్టేష న్‌కు సంబంధించి జారీ చేసిన జీవో కూడా అందరిలో పెనుతుఫాన్‌ సృష్టించింది. ఎవరైతే రిజిస్ర్టేషన్‌ చేయిం చుకుంటారో వారందరికీ ఒరిజినల్‌ కాపీ ఇవ్వబోమని, కేవలం జిరాక్స్‌ కాపీ మాత్రమే ఇస్తున్నట్టు జగన్‌ సర్కా ర్‌ జారీ చేసిన జీవో సారాంశం. ఈ జీవో రెండేళ్ల క్రితమే వెలుగు చూడడంతో భూ లావాదేవీలను తీవ్ర ప్రభావితం చేసింది. అటువైపు రిజిస్ర్టేషన్‌ శాఖలోనూ ప్రభుత్వం కట్టడి పెరిగింది. సాధ్యమైనంత మేర కీలక నిర్ణయాలు తీసుకునే రిజిస్ర్టార్‌లు ప్రస్తుత నిబంధ నలతో నోరెత్తలేని పరిస్థితి. భూమి ధరలను నిర్దేశించే క్రమంలోనూ ఒత్తిళ్ళకు గురైయ్యారు. వైసీపీ నేతల నివాస ప్రాంతాల్లో భూముల ధరలను పెంచాలని ఒత్తిళ్ళు పెంచారు. ఇలా రకరకాలుగా అటు రిజిస్ర్టేషన్‌ శాఖపై ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఇది కాస్త రియల్‌ను ఢమాల్‌ చేశాయి. ప్రభుత్వం మారితేనే తప్ప భూముల విలువకు మళ్ళీ కాళ్ళు రావనే ఆశతో ఉన్నా రు. కొందరైతే ఎన్నికల ప్రచారం మాదిరిగా భూముల సమస్యపైన ప్రచారం చేయడం గమనార్హం.

Updated Date - Apr 29 , 2024 | 12:18 AM