Share News

అంధకారంలో పాలకొల్లు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:29 AM

గ్రామాల్లో ఇప్పటికే ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు అనధికార విద్యుత్‌ కోతలు అమలు చేస్తుండగా, తాజాగా పట్టణాల్లోనూ చీకట్లు అలముకున్నాయి.

అంధకారంలో పాలకొల్లు

పాలకొల్లు, ఏప్రిల్‌ 15 : గ్రామాల్లో ఇప్పటికే ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు అనధికార విద్యుత్‌ కోతలు అమలు చేస్తుండగా, తాజాగా పట్టణాల్లోనూ చీకట్లు అలముకున్నాయి. పాలకొల్లు ఇండోర్‌ స్టేడియంలో అంతరాయం ఏర్పడిందంటూ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. రాత్రి తొమ్మిది గంటలు దాటినా పునరుద్దరించ లేదు. ఒక ఫీడర్‌లో అంతరాయం ఏర్పడినప్పుడు మరొక ఫీడర్‌ ద్వారా, లేదా మరోసబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ను పునరుద్దరిస్తారు. పట్టణంలో ఆరు గంటలపాటు విద్యుత్‌ నిలిచిపోయింది. అసలే వేసవి ఉక్కపోతతో జనం విలవిల్లాడుతుంటే విద్యుత్‌ కోతలు మరింత ఇబ్బందులు పాల్జేశాయి. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరెంటు కష్టాలు ఉండవని ప్రజలు భావించారు. కాని, సీఎం జగన్‌ పాలన ఎలా కొనసాగుతుందో, అదే విధంగా పవర్‌ కట్‌లు ఉన్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:29 AM