Share News

వారెక్కడ?

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:09 AM

ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంత సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతానికి వారి రూటు ఎటు ? మన దారికి తెచ్చుకోవడం ఎలా.. ఏం కావాలంటే అది ఇద్దాం. వాళ్ళంతా బయటపడక్కర్లేదు. అంతర్గతంగా మనకు ఓటేస్తే చాలు. దేనికైనా మేము రెడీ. కాని ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచండి. ఎవరెవరు ఎటు ఎటు వెళుతున్నారో చూడండి. వెంటనే మా చెవిన వేయండి.

వారెక్కడ?

ఎన్నికల వేళ.. సామాజిక వర్గాల వారీగా లెక్కలు

అయిన వారికి కానుకలు, కాని వారికి అడ్డంకులు.. గ్రామాల్లో రకరకాల విన్యాసాలు

అర్ధరాత్రి వరకు విందులు.. మంత్రాంగాలు

(ఏలూరు ఆంధ్రజ్యోతి, ప్రతినిధి):

ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి

చెందిన వారు ఎంత సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతానికి వారి రూటు ఎటు ? మన దారికి తెచ్చుకోవడం ఎలా.. ఏం కావాలంటే అది ఇద్దాం. వాళ్ళంతా బయటపడక్కర్లేదు. అంతర్గతంగా మనకు ఓటేస్తే చాలు. దేనికైనా మేము రెడీ. కాని ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచండి. ఎవరెవరు ఎటు ఎటు వెళుతున్నారో చూడండి. వెంటనే మా చెవిన వేయండి.

ఆ తర్వాత సంగతి మేం చూసుకుంటాం. సామాజిక వర్గాల ఓటర్లను తమ దారికి తెచ్చుకునేందుకు ఏలూరు జిల్లాలోప్రధాన

పక్షాల నేతలంతా వేస్తున్న ఎత్తులు ఇవి.

గడిచిన ఐదేళ్ళలో వివిధ సామాజికవర్గాల్లో వచ్చిన మార్పు లు, చేర్పులపై ఎవరు తమకు అనుకూలంగా వున్నారు ? ఎవరు వ్యతిరేకంగా వున్నారనే అంశాలపై టీడీపీ, నుంచి వైసీపీ వరకు లెక్క కడుతూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో బలమైన సామాజిక వర్గాల ఓటర్లంతా ఏకపక్షంగా వైసీపీ వైపే మొగ్గు చూపాయి. అప్పట్లో టీడీపీ మీద వున్న వ్యతిరేకత కాస్తా వారందరిని ఆ దిశగా నడిపింది. రానురాను ఐదేళ్లలో ప్రజావ్యతిరేక చర్యలు, దాడులు, కేసులు, పోలీసుల ఒత్తిళ్లు, నాయకుల బెదిరింపులతో విసిగిన వివిధ సామాజిక వర్గాల నేతలు, వారి వెంట ఓటర్లు ఈసారి కొత్త అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారు. దీంతో అధికార వైసీపీ అప్రమత్తమైంది. ఏదో రూపంలో వీరిని అడ్డుకు నేందుకు వ్యూహాలకు దిగుతోంది. పైకి ఏ మాత్రం పొగరాకుండా జాగ్రత్త పడుతున్నారు. తమ కోటరీ పరిధిలోని సామాజికవర్గ నేతలను ముందుగా ప్రయోగించి అనుకూలమా, వ్యతిరేకమా అనేది అంచనాకు వస్తున్నారు. దీన్ని కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు గమనించాయి.

ఏలూరు, దెందులూరులో..

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడొంతుల ఓటర్లు నగరంలోనే ఉన్నారు. వీరిలో వివిధ సామాజిక వర్గాలతోపాటు ఉద్యోగుల సంఖ్య ఎక్కువే. సామాజికవర్గ కోణంలోనే ఇప్పుడు లెక్కింపు ప్రారంభమైంది. కాపు, బీసీ, దళిత సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. ఏలూరు రూరల్‌ పరిధిలో కొల్లేరు వాసులు ఉన్నారు. వీటిని బేరీజు వేసుకుని తమదే పైచేయి సాధించేలా జాగ్రత్త పడుతున్నారు. టీడీపీ పక్షాన అత్యధికులు మొగ్గు చూపుతుండగా దీనికి భిన్నంగా వైసీపీ కొత్త ఎత్తుగడకు దిగుతోంది. ప్రశాంతత కావాలంటే తమ కే ఓటు వేయాలంటూ కొన్నేళ్ళుగా జరిగిన కొన్ని ఘటనలపై ప్రచారానికి దిగింది. దెందులూరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అనే యుద్ధం సాగుతోంది. వాదప్రతి వాదనలు, దాడులు, సవాళ్ళు ఇక్కడ రోజూ చోటు చేసుకుం టున్నాయి. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ టార్గెట్‌గా వైసీపీ సోషల్‌ మీడియాలో బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. దాడులకు సరికొత్తరంగులు పులుముతోంది. టీడీపీ అప్రమత్తమై గ్రామాల్లో సామాజిక వర్గాల వారీగా తమ పార్టీ అనుకూలతపై ఇప్పటికే ఓ లెక్క కట్టింది.

నూజివీడు, కైకలూరులో ఇంకో సీన్‌

నూజివీడులో వైసీపీ ప్రతాప్‌ అప్పారావుకు పోటీకి వీలుగా మరో అవకాశం ఇవ్వగా, టీడీపీ బీసీ అభ్యర్థి పార్థసారథిని రంగంలోకి దింపింది. ఇక్కడ బీసీ ఓటర్లు అత్యధికం. వీరే గెలుపు నిర్ణేతలుగా వ్యవ హరిస్తున్నారు. దీంతో గౌడ, యాదవతో సహా మిగతా బీసీ సామాజిక వర్గా లన్ని సారథికి అను కూలంగా ముందుకు వెళుతుండగా, ఇంకోవైపు తనకు ఉన్న పరిధిలో వైసీపీ కూడా ఏ గ్రామా నికి ఆ గ్రామాన బీసీ ఓటర్లు, తమవైపు మొగ్గు చూపేలా ఎత్తుగడలకు దిగుతోంది. వీలైతే కానుకలు, బహుమతులను విసరాలని భావిస్తోంది. నూజివీడు పరిధిలో సామాజికవర్గాల బలాబలాలు ఎవరి వైపు అనుకూలంగా ఉన్నా యో అనే దానిపై ఇరుపార్టీలు ఇప్పటికే లెక్కల తక్కెడ వేస్తు న్నాయి. కైకలూరులోనూ వడ్డిలు, గౌడ, కాపు, యాదవ సామా జిక వర్గీయులు ఈసారి ఏ వైపు తొంగిచూస్తున్నారనే దానిపై ఇప్పటికే టెన్షన్‌ నెలకొంది. ఈ వర్గాలు అన్ని తమకే మద్దతు ఇస్తున్నాయని కూటమి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఎస్సీ వర్గాలతోపాటు బీసీ వర్గాల్లో తమకు మద్దతుదారులు సంతృప్తి కరంగా ఉన్నారనే దానిపై వైసీపీ ఇంకోవైపు లెక్క కడుతోంది. కూటమి వైసీపీ మధ్య సామాజికవర్గాల వారీగా బేరీజు ఉత్కంఠ రేపుతోంది.

పోలవరం, చింతలపూడిలో ఇంకో తీరు

ఎస్సీ రిజర్వుడ్‌ చింతలపూడి, ఎస్టీ రిజర్వుడ్‌ పోలవరం నియోజకవర్గాల్లో ఏలూరు జిల్లాలోని ఓటర్ల సంఖ్య అత్యధికం. ఈ రెండుచోట్ల విభిన్న కోణాల్లోనే ఉన్నాయి. చింతలపూడిలో బీసీలతోపాటు కాపు, ఎస్సీ, రెడ్డి, సామాజిక వర్గానికి చెందిన వారే ప్రతిసారి అభ్యర్థుల గెలుపు, ఓటమిలను నిర్దేశిస్తున్నారు. ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఒక్కటవ్వడంతో సామాజికవర్గాల్లో ఓటర్ల మద్దతులో మార్పులు, చేర్పులు వచ్చా యి. మండలాల వారీగానే కాకుండా చింతలపూడి, జంగారెడ్డి గూడెం నగర పంచాయతీల్లో ఉన్న ఓటర్లే గెలుపు నిర్ణేతలు కాబోతున్నారు. ఈ రెండు ప్రాంతాలపైనే అటువైపు కూటమి, ఇటువైపు వైసీపీ మోహరించి అనుకూలత, వ్యతిరేకత పైన సామాజిక వర్గాల మద్దతుపైనే ఓ అంచనాకు వచ్చేందుకు ముప్పుతిప్పలు పడుతున్నాయి. పోలవరంలోనూ ఇదే విధమైన కసరత్తు సాగుతోంది. ఇక్కడి ఏడు మండలాల్లోనూ బలాబలా లపై దృష్టి పెట్టారు. ఎస్టీ సామాజికవర్గంలో భిన్నతెగలు ఉండ డం వీరంతా ఏకపక్షం కాకుండా పరస్పర భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. గతంలో వైసీపీకి వరుసగా విజయాలు అందిస్తూ వచ్చిన వీరంతా ఈసారి కొత్త అడుగులు వేస్తున్నారంటూ కూటమి అంచనా వేస్తోంది. ముంపు మండలాలైన కుక్కలూరు, వేలేరుపాడులో నిర్వాసితులు అంతా ఓ సామాజిక వర్గంగా ఏర్పడి, తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం కాబోతోంది. ఈ నిర్ణయం తమకు అనుకూలంగానే ఉండబోతోందని ఇప్పటికే కూటమి ఓ లెక్కకు వచ్చింది.

ఉంగుటూరులో నువ్వా నేనా..

ఉంగుటూరులో సామాజిక వర్గాల ప్రభావం అత్యఽధికం. జనసేన అభ్యర్థి ధర్మరాజుకు బలమెంత? అదనంగా చేకూరే బలమెంత? తమకు ఒనగూరే ప్రయోజనం ఏంటి..? అనేది వైసీపీ సామాజిక లెక్క లకు పదును పెట్టింది. కాని ఇక్కడవున్న బీసీలు, కాపులతోపాటు మిగతా సామాజికవర్గాల వారు మొదటి నుంచి తేలిపోకుండా ఆఖరికి తమ తీర్పు భిన్నంగా ఉండేలా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుబాబు, జనసేన బలపరిచిన కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఉన్నారు. టీడీపీలో బలమైన సామాజిక వర్గాలతోపాటు బీసీ వర్గాలు సమ్మిళితమైన నాయకత్వం ఉంది. ఈ వైపు నుంచే సంపూర్ణ మద్దతు తమకే ఉంటుందని, తమకు ఇక తిరుగులేదని, ఇప్పటికే జనసేన అభ్యర్థి ఒక నిర్ణయానికి వచ్చేశారు. తన గెలుపునకు ఢోకాలేదని భావిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేశారు.

Updated Date - Apr 29 , 2024 | 12:09 AM