Share News

సివిల్‌ ఇంజనీర్‌గా..

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:59 PM

సివిల్‌ ఇంజనీర్‌గా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వేగవంతమయ్యేలా కృషి చేస్తూ నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో అన్నివిధాలా న్యాయం చేస్తానని ఏలూరు ఎంపీ కూటమి అభ్యర్ధి పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.

సివిల్‌ ఇంజనీర్‌గా..
కుక్కునూరు మండలంలో ఎంపీ అభ్యర్థి పుట్టా, ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చూస్తా

ఏలూరు ఎంపీ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌ హామీ

కుక్కునూరు/వేలేరుపాడు, ఏప్రిల్‌ 28 : సివిల్‌ ఇంజనీర్‌గా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వేగవంతమయ్యేలా కృషి చేస్తూ నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో అన్నివిధాలా న్యాయం చేస్తానని ఏలూరు ఎంపీ కూటమి అభ్యర్ధి పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. ఆదివారం పోలవరం అసెంబ్లీ అభ్యర్థి చిర్రి బాలరాజుతో కలసి కుక్కునూరు మండలంలో దాదాపు 40 కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహిస్తూ నిర్వాసితులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. వందలాది వాహనాలతో వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ రోడ్‌షోకు అనూహ్యమైన స్పందన లభించింది. కూటమి అభ్యర్థులను గ్రామాల్లోకి ఆహ్వానిస్తూ గిరిజన కళాకారులు డప్పు కళాకారులు నృత్యం, విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎంపీ అభ్యర్థి పుట్టా తనదైన శైలిలో నిర్వాసిత సమస్యలపై పదేపదే మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం టీడీపీ హయాంలో 75 శాతం పూర్తిచేయగా జగన్‌ ప్రభుత్వం కనీసం రెండు శాతం కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పోలవరం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నిర్వాసితుల కోసం ఏమాత్రం పనిచేయలేదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫ కూటమి అభ్యర్థులైన చిర్రి బాలరాజు, పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌ వేలేరుపాడు మండలంలో ప్రచారానికి రాగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి రోడ్‌షోను విజయవంతం చేశారు. వేలేరుపాడు మండలం వసంతవాడ నుంచి రుద్రమకోట, రేపాకగొమ్ము గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Updated Date - Apr 28 , 2024 | 11:59 PM