Share News

రేపటి నుంచి క్షీరా రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:36 AM

పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈనెల 17 తేదీ బుధవారం నుంచి 23వ తేదీ మంగళ వారం వరకూ వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో యాళ్ళ సూర్య నారాయణ తెలిపారు.

రేపటి నుంచి క్షీరా రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాలు
విద్యుద్దీపాలంకరణలో ఆలయం..

పాలకొల్లుఅర్బన్‌, ఏప్రిల్‌ 15 : పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈనెల 17 తేదీ బుధవారం నుంచి 23వ తేదీ మంగళ వారం వరకూ వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో యాళ్ళ సూర్య నారాయణ తెలిపారు. 17వ తేదీ అంకురార్పణ, 18 రాత్రి పార్వతీ సమేత క్షీరా రామలింగేశ్వర స్వామివారికి, లక్ష్మీ సమేత జనార్ధన స్వామివార్లకు వైభవంగ కల్యాణం నిర్వహిస్తామని తెలిపారు.19వ తేదీ శుక్రవారం సాయంత్రం స్వామివార్ల రఽథోత్సవం, 23వ తేదీ ఉదయం స్వామివార్ల త్రిశూల స్నానం, సాయంత్రం 6.45కు పుష్పోత్సవం నిర్వహిస్తున్నట్టు ఈవో తెలిపారు. సోమ వారం సందర్భంగా స్వామివారికి ఏక వార రుద్రాభిషేకాలు నిర్వహించారు.

Updated Date - Apr 16 , 2024 | 12:36 AM