Share News

గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌..

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:58 AM

మండలంలోని పెనుమల్లిలో సోమ వారం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై మంటలు వ్యాపించి సమీపంలోని చెత్తకు అంటుకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి.

గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌..
గుడ్లవల్లేరు–ముదినేపల్లి ప్రధాన రహదారిపై మంటలు

ముదినేపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 15: మండలంలోని పెనుమల్లిలో సోమ వారం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై మంటలు వ్యాపించి సమీపంలోని చెత్తకు అంటుకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమై గ్యాస్‌ సరఫరా నిలిపి వేశారు. సంబంధిత గ్యాస్‌ కంపెనీ అధికారులు మరమ్మతులు చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. పనులను మండవల్లి మండల తహసీ ల్దార్‌ పర్యవేక్షించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:59 AM