Share News

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:33 AM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరు అవ గాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం ఫైర్‌ ఆఫీసర్‌ జి.అబ్రహం సూచించారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం
భీమడోలులో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

అగ్నిమాపక వారోత్సవాల్లో మాక్‌ డ్రిల్‌

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 15: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరు అవ గాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం ఫైర్‌ ఆఫీసర్‌ జి.అబ్రహం సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బస్టాండ్‌ సెంటర్‌లో సోమవారం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రయోగాత్మక అవగాహన కల్పించారు. వేసవి లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు వంట చేసేటప్పుడు గ్యాస్‌ వాడకంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

భీమడోలు: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని అగ్నిమాపక అధికారి నాగరాజు సూచించాడు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా భీమడోలు జంక్షన్‌లో పలు విన్యాసాలు నిర్వహించారు. ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు.

ఏలూరు క్రైం: అగ్నిమాపక వారోత్సవాల్లో బాగంగా జిల్లా అదనపు అగ్నిమాపక శాఖాధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏలూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు రైల్వే స్టేషన్‌, కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో ప్రయాణికులకు కరపత్రాలు అందించి అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు ఎలా తీసుకో వాలో తెలియజేశారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే దానిని నియంత్రించాలనే అంశంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వేసవి కాలంలో నిప్పు పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యంగా తాగిన సిగరెట్లను ఆర్పకుండా పడవేయకూడదని, ఇంట్లో గ్యాస్‌ స్టౌపై వంట అయిపోగానే రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయాలన్నారు. మోటారు సైకిళ్లను ఎండలో పార్కింగ్‌ చేయకూడదని సూచించారు.

Updated Date - Apr 16 , 2024 | 12:33 AM