Share News

విస్తృతంగా తనిఖీలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:50 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు.

విస్తృతంగా తనిఖీలు
బెల్లపుఊట ధ్వంసం చేస్తున్న పోలీసులు

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 28 :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా రూ.7,360 విలువైన 23.9 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని ప్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు తనిఖీల్లో రూ.70 వేలు నగదు సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా బృందాలు దాడులు నిర్వహించాయి. అదనపు ఎస్పీ స్వయంగా పాల్గొని అటవీ ప్రాంతంలో సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో కార్టెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లాలో నాటుసారా, మద్యం, గంజాయి, నగదు అక్రమ రవాణా జరుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. శుక్రవారం చింతలపూడి, భీమడోలు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం, ఏలూరు, కైకలూరు ఎస్‌ఇబి పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు.4,200 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. 216 కేజీల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్యూటీపెయిడ్‌ లిక్కర్‌ కల్గి ఉన్నవారిపై 9 కేసులు నమోదు చేసి 35.61 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ కల్గి ఉన్న వారిపై ఇద్దరుపై కేసులు నమోదు చేసి 11.9 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకు న్నారు. 15 మంది వ్యక్తులను, ఒక మోటారు సైకిల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 11:50 PM