Share News

ఆకివీడులో చైన్‌ స్నాచింగ్‌..

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:33 AM

మోటారు సైకిల్‌పై ఇంటికొస్తున్న భార్య, భర్తలను వెంబడించి మహిళ మెడలో బం గారం తాడు గుంజుకొనే సమయంలో బాధితురాలు కింద పడడంతో త్రీవ గాయాలయ్యాయి.

ఆకివీడులో చైన్‌ స్నాచింగ్‌..

బైక్‌పై నుంచి పడి మహిళకు గాయాలు

ఆకివీడు, ఏప్రిల్‌ 15: మోటారు సైకిల్‌పై ఇంటికొస్తున్న భార్య, భర్తలను వెంబడించి మహిళ మెడలో బం గారం తాడు గుంజుకొనే సమయంలో బాధితురాలు కింద పడడంతో త్రీవ గాయాలయ్యాయి. ఆకివీడుకు చెందిన చెల్లింకల రాధాకుమారికి వారం రోజులు క్రితం పన్నుపోటు రావడంతో భీమవరం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటు న్నది. ఆదివారం రాధాకుమారి భర్త శ్రీనివాసుతో కలిసి మందులు కోసం గణపవరం వెళ్లి కాపవరం మీదుగా ఆకివీడు తిరిగి వస్తున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో గుమ్ములూరు రోడ్‌లోని గాలిబ్‌ చెరువు సమీపంలోని చర్చి దగ్గరకు వచ్చేసరికి వెనకాల ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి వెనుక కూర్చున్న రాధాకుమారి మెడలో బంగారం తాడు గుంజుకోపోయాడు.పెనుగులాటలో ఆమె కిందపడిపోయింది. రాధాకుమారి ఎడమకాలుకి తీవ్ర గాయాలవడంతో సీహెచ్‌సీలో జాయిన్‌ చేసి పోలీసులకు భర్త శ్రీనివాసు ఫిర్యాదు చేశారు. రాధాకుమారి కాలుకు లోపల నాలుగు, బయట 13 కుట్లు పడ్డాయి. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:33 AM