Share News

ఉపాధి అవకాశాలు కల్పిస్తాం: జగదీశ్వరి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:10 AM

కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పి స్తామని కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయిక జగదీశ్వరి అన్నారు.

ఉపాధి అవకాశాలు కల్పిస్తాం: జగదీశ్వరి

కురుపాం రూరల్‌: కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పి స్తామని కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయిక జగదీశ్వరి అన్నారు. మండలంలోని మొండెం ఖల్‌, పి.లేవిడి పంచాయతీ ల్లో ఆమె ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము అధికారంలో వస్తే గిరిజన ప్రాంతాల్లో జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతామని, జీడి పళ్ల నుంచి రసం తీసి కూల్‌డ్రింక్‌లు, పచ్చళ్లు తయారీ చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రచారంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేశ్‌ చంద్రదేవ్‌ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోని రావడం చారిత్రక అవసరం అన్నారు. టీడీపీ మండల కన్వీనరు కలిశెట్టి కొండయ్య, రంజిత్‌కుమార్‌ నాయికో, సుఖేష్‌ చంద్ర పండా తదితరులు పాల్గొన్నారు.

గిరిజన ఆడబిడ్డను గెలిపించండి

గుమ్మలక్ష్మీపురం: ‘నేను మీ గిరిజన ఆడబిడ్డను నన్ను కురుపాం ఎమ్మెల్యేగా గెలిపించాల’ని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కోరారు. ఆమె ఆదివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గిరిజ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, ఐటీఐ, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ గురుకుల పాఠశాల ఏర్పడ్డాయని ఆమె గుర్తు చేశారు. విద్య, వైద్య సంస్థల మెరుగుకు టీడీపీ కృషి చేసిందన్నారు. తనను గెలిపిస్తే మారుమూల కొండశిఖర గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పిస్తానన్నారు. నిరుపయోగంగా ఉన్న యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. కొమరాడ మండలం పూర్ణపాడు, లాబేసు వంతెనను పూర్తి చేయడానికి శక్తివంచనలు లేకుండా కృషి చేస్తానని ఆమె హామీనిచ్చారు.

Updated Date - Apr 29 , 2024 | 12:10 AM