Share News

వదలని గజరాజులు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:31 AM

జియ్యమ్మలస మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గవరమ్మపేట, బాసంగి, పెదమేరంగి, కన్నపుదొరవలస పంచాయతీల్లో కొద్దిరోజులుగా సంచరిస్తూ.. ఆయా గ్రామస్థులను హడలెత్తిస్తున్నాయి.

 వదలని గజరాజులు
సుభద్రమ్మవలసలో సంచరిస్తున్న ఏనుగులు

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 15 : జియ్యమ్మలస మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గవరమ్మపేట, బాసంగి, పెదమేరంగి, కన్నపుదొరవలస పంచాయతీల్లో కొద్దిరోజులుగా సంచరిస్తూ.. ఆయా గ్రామస్థులను హడలెత్తిస్తున్నాయి. ఆదివారం గవరమ్మపేట పంచాయతీలో ఎరుకులపేట, వె ంకటరాజపురం గ్రామాల్లో తిరిగిన ఏనుగులు సోమవారం ఉదయం పెదమేరంగి పంచాయతీ రామినాయుడువలసకు చేరాయి. మధ్యాహ్నం కన్నపుదొరవలసకి చేరుకుని సాయంత్రానికి అదే పంచాయతీలోని సుభద్రమ్మవలస గ్రామ సమీపంలో తిష్ఠ వేశాయి. కాగా ఆయా ప్రాంతాల్లో వరి, అరటి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తక్షణమే మండలం నుంచి గజరాజులను తరలించేలా అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.



Updated Date - Apr 16 , 2024 | 12:31 AM