Share News

పేదల ఆర్థికాభివృద్ధికే సూపర్‌సిక్స్‌: జయకృష్ణ

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:11 AM

పేదల ఆర్థికాభివృద్ధికి సూపర్‌సిక్స్‌ పథకాలు ఎంతో ఉపయో గపడతాయని కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు.

పేదల ఆర్థికాభివృద్ధికే సూపర్‌సిక్స్‌: జయకృష్ణ

సీతంపేట: పేదల ఆర్థికాభివృద్ధికి సూపర్‌సిక్స్‌ పథకాలు ఎంతో ఉపయో గపడతాయని కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. మండలంలోని హడ్డుబంగి పంచాయతీ పరిధిలోగల కొత్తగూడ గ్రామంలో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సవరతోట ముఖలింగం, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు గొట్టుముక్కల కోటేశ్వరరావు, సీనియర్‌ నాయకుడు నిమ్మక నాగేశ్వరరావు, ఐటీడీపీ కో-ఆర్డినేటర్‌ హిమరిక పవన్‌, సవర సోడంగి, మహాశక్తి ప్రచారకర్త తోయక సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడ మాజీ సర్పంచ్‌ సవర భాస్కరరావుతో పాటు వైసీపీకి చెందిన 30 కుటుంబాల ప్రతినిధులు జయకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.

పార్టీలో చేరిక

పాలకొండ: చింతాడ గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీ మండల అధ్యక్షుడు గండి రామినా యుడు ఆధ్వర్యంలో కూటమిలో చేరాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వంజరాపు ఈశ్వరరావు, కోట సంగంనాయుడు, శాసపు గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.

వీరఘట్టం: జనసేన పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. తోటపల్లి మాజీ చైర్మన్‌ నిమ్మక పాండురంగారావు, వీరఘట్టం మండల అధ్యక్షుడు ఉదయాన ఉదయ్‌భాస్కర్‌, మండల తెలుగు యువత అధ్యక్షుడు మాచర్ల అనీల్‌బాబు ఆధ్వర్యంలో మూల లంకలో సర్పంచ్‌ ప్రతినిధి బిడ్డిక సూర్యంతో పాటు 65 కుటుంబాలు కూటమిలో చేరాయి. లింగాల చంటి, చింతా ఉమామహేశ్వరరావు, బీపీ నాయుడు, మత్స వెంకటరమణ, జనసేన జానీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:11 AM