Share News

ఆప్కాస్‌ కార్మికులకు జీతాలు చెల్లించాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:24 AM

నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజి నీరింగ్‌ తదితర విభా గాల్లో ఆప్కాస్‌ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించా లని మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూ నియన్‌ నాయకులు ఎ.జగన్మోహన్‌రావు తదితరులు కోరారు.

ఆప్కాస్‌ కార్మికులకు జీతాలు చెల్లించాలి

విజయనగరం దాస న్నపేట: నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజి నీరింగ్‌ తదితర విభా గాల్లో ఆప్కాస్‌ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించా లని మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూ నియన్‌ నాయకులు ఎ.జగన్మోహన్‌రావు తదితరులు కోరారు. ఈమేరకు సోమవారం నగరపాలక సంస్థ సహాయ కమిషన ర్‌ తిరుమలరావుకు యూనియన్‌ ప్రతిని ధులు రామచంద్రరావు, శంకరరావు, వంశీ తదితరులు వినతిపత్రం అంద జేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ మార్చి నెల వేతనం చెల్లించక పోవడంతో బ్యాంకు రుణాలు, అప్పులకు అధిక వడ్డీలు కార్మికులకు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. సమ్మెకాలం జీతంతో పాటు 2022-23లో రూ.12 వేలు హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు ఇవ్వాలని కోరారు.

Updated Date - Apr 16 , 2024 | 12:24 AM