Share News

ఆమె ఓటే శాసనం...

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:44 PM

జిల్లా రాజకీయాలను మహిళలు శాసించబోతున్నారు. పార్టీల గెలుపు రాతను నారీమణులే రాయబోతున్నారు. అభ్యర్థుల విజయావకాశాలను వారే నిర్ణయించబోతున్నారు. వారి కరుణపొందిన వారే అధికారం చేపట్టబోతున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో వారి ఓట్లే అభ్యర్థుల బలాబలాలను నిర్ణయించబోతున్నాయి.

ఆమె ఓటే శాసనం...

- ఆరు నియోజకవర్గాల్లో మహిళలే అధికం

- సూపర్‌ సిక్స్‌ పథకాలపై టీడీపీ ఆశలు

- ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్న నారీమణులు

జిల్లా రాజకీయాలను మహిళలు శాసించబోతున్నారు. పార్టీల గెలుపు రాతను నారీమణులే రాయబోతున్నారు. అభ్యర్థుల విజయావకాశాలను వారే నిర్ణయించబోతున్నారు. వారి కరుణపొందిన వారే అధికారం చేపట్టబోతున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో వారి ఓట్లే అభ్యర్థుల బలాబలాలను నిర్ణయించబోతున్నాయి.

రాజాం రూరల్‌: జిల్లా రాజకీయ పరమపద సోపాన పటంలో ఎవరికి నిచ్చెనలు ఎక్కించాలో... ఎవరికి చట్టసభలకు పంపించాలో.. ఎవరికి అధికారయోగం కల్పించాలో.. ఈసారి మహిళలే నిర్ణయించనున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళలే కీలక పాత్ర పోషించబోతున్నారు. రాజకీయ చరిత్రను కొత్తమలుపు తిప్పబోతున్నారు. జిల్లాలో ఏడింట ఆరు నియోజకవర్గాలలో మహిళలే అధికంగా ఉన్నారు. వారి కరుణా కటాక్షాలు పొందేందుకు పార్టీలు.... అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. మహిళల కోసం పార్టీలు ప్రవేశపెట్టే పఽథకాలు కూడా విజయంలో కీలకం కానున్నాయి. ఎన్నికలలో తమ ఓటే శాసనమని.. ఓటరు జాబితాలో నమోదైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

- జిల్లాలో..

వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో రాజాం మినహా విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎస్‌.కోట నియోజకవర్గాలలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఫలితాలను ప్రభావితం చేసే శక్తి స్త్రీలకే ఎక్కువగా ఉంది. మహిళలు రాజకీయ రంగంలో రాణించడమే కాకుండా ఎన్నికల సమయంలో అభ్యర్థుల అనుకూల, ప్రతికూల పరిస్థితులను కూడా లెక్కలు వేస్తున్నారు. మగువలు ఎవరివైపు మొగ్గు చూపితే వారికే అధికారం వచ్చే అవకాశం ఉంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో మహిళా ఓటర్లు ఎవరి గెలుపునకు దోహదపడతారో చూడాలి.

- సూపర్‌ సిక్స్‌ పథకాలపై మహిళల మక్కువ

గతానికి భిన్నంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలపై జిల్లా అంతటా చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు మహిళలు మాట్లాడుకున్నా బాబు అమలు చేస్తామని ప్రకటించిన పఽథకాలపైనే చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చే నాలుగు రూపాయల కంటే... టీడీపీ ప్రకటించిన పథకాలతో శాశ్వత ప్రయోజనం కలుగుతుందన్న వాదన జిల్లా అంతటా మహిళల్లో బలంగా వినిపిస్తోంది.

- ఏడాదికి రూ.15 వేలు

స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించడంపై మహిళల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికీ రూ.15 వేలు వంతున ఇస్తామన్న బాబు ప్రకటన మహిళల్లో కొత్త ఆలోచనకు తెరలేపింది. వైసీపీ ప్రభుత్వం సైతం ఇదే మాదిరిగా ప్రకటించినా... తొలి ఏడాదికే పరిమితం కావడంపై మహిళల్లో చర్చ కొనసాగుతోంది.

- ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న తెలుగుదేశం ప్రకటన మహిళామణులకు వరంగా మారనుందన్న ప్రచారం సాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1100 దాటిన నేపథ్యంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామనడంపై మహిళలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో ఉచిత సిలిండర్ల ప్రకటన కారుచీకట్లో కాంతిపుంజంలో కనిపిస్తోంది.

- ఆర్టీసీలో ఉచిత ప్రయాణం...

మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న చంద్రబాబు ప్రకటన మహిళల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రస్తుత ప్రభుత్వంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటిన నేపఽథ్యంలో ఆర్టీసీ ఽచార్జీలు భారీగా పెరగడం.. ఆటో ఎక్కితే మినిమం ఛార్జీ రూ.20 పలుకుతున్న వేళ.... ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించవచ్చన్న ఆలోచన వారిలో టీడీపీ ప్రభుత్వానికి మద్దతు పలకాలన్న ఉత్సాహం నింపుతోంది. ఈసారి తెదేపా అభ్యర్థులను గెలిపించుకోవాలన్న కసి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

- ఆశల పల్లకిలో యువత

యువతో కొంగొత్త ఆశలు కనిపిస్తున్నాయి. అయిదేళ్లలో 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి కల్పించే లక్ష్యంతో టీడీపీ సిద్ధం చేసిన మేనిఫెస్టో పట్ల యువత ఆకరిర్షితులవుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమైన నేపథ్యంలో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న యువత టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.

..............................................................................................................

నియొజకవర్గం పేరు పురుషులు మహిళలు

..............................................................................................................

విజయనగరం 1,21,235 1,28,312

గజపతినగరం 99,745 1,03,576

బొబ్బిలి 1,13,027 1,15,791

చీపురుపల్లి 1,01,574 1,01,595

నెల్లిమర్ల 1,04,676 1,06,874

ఎస్‌.కోట 1,07,188 1,13,117

రాజాం 1,12,955 1,11,253

..............................................................................................................

- జిల్లాలో..

మొత్తం ఓటర్లు.. 15,41,201

పురుషులు 7,60.400

మహిళలు 7,80,518

థర్డ్‌ జెండర్‌ 83

Updated Date - Apr 29 , 2024 | 11:44 PM