Share News

ఎన్నికల ఖర్చంతా వీఆర్వోలపైనే

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:33 PM

సాధారణంగా ఎన్నికల ఖర్చుకు సం బంధించిన డబ్బును ఆర్వోలు, వీఆర్వోలు, ఏఈఆర్వోలు విడుదల చేస్తుంటారు. ఆర్వోల నుంచి ఏఈఆర్వోలు, వీఆర్వోలకు సొమ్ము విడుదలవుతుంటుంది.

 ఎన్నికల ఖర్చంతా వీఆర్వోలపైనే

- అప్పు చేసి భరిస్తున్నాం

- ఎన్నికలయ్యాక చేతికందని నగదు

- గత ఎన్నికల్లో పరిస్థితి ఇదే

- ఆదుకోవాలంటూ ఈసీకి విజ్ఞప్తి

(గరుగుబిల్లి)

సాధారణంగా ఎన్నికల ఖర్చుకు సం బంధించిన డబ్బును ఆర్వోలు, వీఆర్వోలు, ఏఈఆర్వోలు విడుదల చేస్తుంటారు. ఆర్వోల నుంచి ఏఈఆర్వోలు, వీఆర్వోలకు సొమ్ము విడుదలవుతుంటుంది. వీరిలో సాధారణంగా తహసీల్దారులే ఉంటారు. తహసీల్దారులు తి రిగి ఆర్‌ఐలకు పనులు పుర మాయిస్తారు. ఆర్‌ఐలు ఆ ప నులను వీఆర్వోలపై పెడతారు. అంతిమం గా ఆ ఖర్చు వీఆర్వోల మెడకు చుట్టుకుం టుంది. చాలా చోట్ల వీఆర్వోలు, బీఎల్‌వో లుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరంతా రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం అప్పులు చేయా ల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి నిధులు ఏమీ రాకపోవడంతో ఎన్నికలయ్యే వరకు ఓపిక పట్టాలి. అప్పులు ఇచ్చిన వారిని బతిమిలాడుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమయ్యే స్టేషనరీ, పేపర్‌ బండిల్స్‌, దరఖాస్తులు, ప్రింటింగ్‌ కాపీలు, ఎలక్టోరల్‌ రోల్స్‌, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ర్యాంపులు, కేంద్రాల్లో పరిశుభ్రత, ఇవన్నీ వీఆర్వోలే చూసుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి, ఆర్వోలు వస్తే ప్రోటోకాల్‌ ప్రకారం వారి ఖర్చులన్నీ భరించాలి. పోలింగ్‌ సమయంలో భారీగా ఖర్చు ఉంటుంది. ఒక్కో మండలానికి సగటున 60 పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయనుకుంటే... ఒక్కో కేంద్రానికి 12 మంది సిబ్బంది ఉంటారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లకు అల్పాహారం, భోజనాలు, స్నాక్స్‌, మజ్జిగ వంటివి ఏర్పాటు చేయాలి. డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలకు చేరుకునే సిబ్బందికి అల్పాహారాలు, భోజనాలు పెట్టాలి. ఇలా లక్షల రూపాయలను ఖర్చు చేసినా చివరకు ఆ డబ్బు చేతికి అందక వీఆర్వోలు ప్రతి ఎన్నికల్లో ఇబ్బం దులు పడుతున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలో ఇతర జిల్లాల తహసీల్దారులు బదిలీపై వస్తుంటారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన డబ్బు వీరు తీసుకు వెళ్లిపోతూ ఉండటంతో వీఆర్వోలు నిండా మునిగిపోతున్నారు. గత ఎన్నికల్లోనూ ఇదే తంతు జరిగింది. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే వారికే ఎన్నికల సంఘం ఆ మొత్తం ఇవ్వాలని వీఆర్వోలు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో పడిన ఇబ్బందులు, ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను వీఆర్వోల సంఘం నాయకులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు.

బీఎల్‌వోలకు గౌరవ వేతనం లేదు

బీఎల్‌వోలకు గత ఎన్నికల సమయంలోనూ గౌరవ వేతనం ఇవ్వలేదు. ఆ నిధు లు తక్షణమే విడుదల చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి ఈ విష యాన్ని తీసుకువెళ్లాం. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగలందరికీ ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగానికి రిటర్నింగ్‌ అధికారి పరిధిలో చర్యలు తీసుకోవాలి.

- మరడ సింహాచలంనాయుడు,

జిల్లా వీఆర్వోల సంఘ అధ్యక్షుడు, పార్వతీపురం

Updated Date - Apr 28 , 2024 | 11:33 PM