Share News

కనీస వేతనం రూ.300 ఇవ్వాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:27 AM

ఉపాధిహామీ పథకం ద్వారా పనులు చేస్తున్న తమకు పనికి తగ్గ వేతనం రావడంలేదని సోమవారం కొత్తవలస ఎంపీడీవో కార్యా లయం ఎదుట కూలీలకు ఆందోళన చేపట్టారు.

    కనీస వేతనం రూ.300 ఇవ్వాలి

లక్కవరపుకోట (కొత్తవలస): ఉపాధిహామీ పథకం ద్వారా పనులు చేస్తున్న తమకు పనికి తగ్గ వేతనం రావడంలేదని సోమవారం కొత్తవలస ఎంపీడీవో కార్యా లయం ఎదుట కూలీలకు ఆందోళన చేపట్టారు. మండుటెండలో పనిచేసినా పూట గడవడం లేదని వాపోయారు. కనీస వేతనం రూ.300 ఇవ్వాలని, వేసవి అలవెన్స్‌ విడుదల చేయాలని, టెంట్లు, గునపాలు ప్రభుత్వమే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసే ఉద్దేశంలో ఉందని సీఐటీ యూ, వ్యవసాయ కార్మిక సంఘ నేతలు మద్దిల రమణ, గాడి అప్పారావులు మండిపడ్డారు. వారంవారం పేమెంట్స్‌ అందాలని, మేట్ల జీతాలు విడుదల చేయాలని పేర్కొన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవోకు అందజేశారు.

Updated Date - Apr 16 , 2024 | 12:27 AM