Share News

గిరిజన సంఘం నేత అరెస్టు, విడుదల

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:53 AM

అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ సభ ఉంటే జి.మాడుగుల మండలంలో ఉండే ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాగిన ధర్మాన పడాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ మద్దులబంధ గ్రామంలో ఉదయం ఆరు గంటలకే ధర్మాన పడాల్‌ను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

గిరిజన సంఘం నేత అరెస్టు, విడుదల
ధర్మాన పడాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు

పక్క జిల్లాలో సీఎం సభ ఉంటే జి.మాడుగులలో ధర్మాన పడాల్‌ అరెస్టు

- ఖండించిన గిరిజన సంఘం నేతలు

అరకులోయ/జి.మాడుగుల, ఏప్రిల్‌ 29: అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ సభ ఉంటే జి.మాడుగుల మండలంలో ఉండే ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాగిన ధర్మాన పడాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ మద్దులబంధ గ్రామంలో ఉదయం ఆరు గంటలకే ధర్మాన పడాల్‌ను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొంత సమయం తరువాత ఆయనను విడిచిపెట్టారు. పక్క జిల్లాలో సీఎం సభ జరిగితే ఈ జిల్లా గిరిజన నేతను అరెస్టు చేయడం ఏమిటని ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ నిరంకుశ చర్య అని బాలదేవ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ధర్మాన పడాల్‌ అరెస్టును గిరిజన సంఘం నేతలు, వామపక్ష నేతలు ఖండించారు.

Updated Date - Apr 30 , 2024 | 12:53 AM