Share News

మైదానం కాదు.. చెరువే..

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:05 AM

మండలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఏడు నెలలుగా తగిన వర్షాలు లేక చెరువులు, కాలువలు ఎండిపోతున్నాయి. దీని వల్ల గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ పూర్తిగా బీళ్లుగా మారాయి.

మైదానం కాదు.. చెరువే..
ఎండిపోయిన రొంగలిపాలెం చెరువు

- పూర్తిగా ఎండిపోతున్న చెరువులు

- సాగునీటి వనరుల సంరక్షణ లేక, వర్షాలు పడక ఈ దుస్థితి

రోలుగుంట, ఏప్రిల్‌ 29: మండలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఏడు నెలలుగా తగిన వర్షాలు లేక చెరువులు, కాలువలు ఎండిపోతున్నాయి. దీని వల్ల గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ పూర్తిగా బీళ్లుగా మారాయి.

గతంలో రెండు, మూడేళ్లు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా అవ, చెరువుల్లో కొంతమేరకు నీరుండడం వల్ల కరువు కనిపించేది కాదు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి చెరువులు, కుంటలు ఉన్నాయి. అయితే చెరువుల్లో పూడికలు తీయించడానికి, ఆక్ర మణలను అరికట్టడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో చెరువులు మైదానాలను తలపిస్తున్నాయి. గత రెండు నెలల నుంచి ఎండలు విపరీతంగా కాస్తుండడంతో చెరువుల్లో ఉన్న కొద్దిపాటి చెలమలు కూడా పూర్తిగా ఎండిపోయాయి. మండలంలోని దాదాపు 150కు పైగా చిన్న, పెద్ద ఉన్న చెరువులు పూర్తిగా చుక్క నీరు లేకుండా పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. దీనికి తోడు బోర్ల నుంచి నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఎండుతున్న పంటలు

ప్రస్తుతం చెరువుల్లో చుక్కనీరు లేకపోవడం వల్ల ఆయకుట్ట భూముల్లో సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయి. ఆవ, చెరువు ఆయకట్ట దిగువన రైతులు వేసవి పంటలను ప్రతీ ఏటా సాగుచేసేవారు. అయితే ఈ ఏడాది మాత్రం ఎటువంటి పంటలు పండించడానికి ఆస్కారం లేకుండా ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 01:05 AM