Share News

గ్రూప్‌-2 విజయమే లక్ష్యంగా కృషి చేయాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:40 AM

గ్రూప్‌-2 మెయిన్స్‌లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని అభ్యర్థులకు ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ సూచించారు. విశాఖపట్నం వేపగుంటలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఉచిత సివిల్స్‌ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో సోమవారం ఆయన సమావేశమై మాట్లాడారు.

గ్రూప్‌-2 విజయమే లక్ష్యంగా కృషి చేయాలి
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌, పక్కన ఏటీడబ్లూవో ఎల్‌.రజని

శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ఐటీ డీఏ పీవో అభిషేక్‌

పాడేరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 మెయిన్స్‌లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని అభ్యర్థులకు ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ సూచించారు. విశాఖపట్నం వేపగుంటలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఉచిత సివిల్స్‌ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో సోమవారం ఆయన సమావేశమై మాట్లాడారు. బాగా సాధన చేసి ప్రభుత్వ కొలువులు సాధించాలన్నారు. అలాగే గ్రూపు-2లో విజయం సాధిస్తే గ్రూప్‌ -1 సాధిస్తామనే నమ్మకం పెరుగుతుందన్నారు. ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తే గిరిజన ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. ఏజెన్సీలో వున్న మరింత మంది నిరుద్యోగులకు నమ్మకం పెరిగేలా పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న 117 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు ఆదర్శంగా మీ ఫొటోలను చూపిస్తామన్నారు. మీరంతా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాను ఆదర్శంగా తీసుకుని సివిల్స్‌లో విజయం సాధించాలన్నారు. ఆయన సివిల్స్‌ సాధించడంతో రాజస్థాన్‌లో మూడు జిల్లాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. అనంతరం పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు జాగ్రఫీ పాఠ్యాంశాలను బోధించారు. ఎకనామిక్‌ సర్వే ఆఫ్‌ ఏపీపై వారికి అవగాహన కల్పించారు. గ్రూప్‌- 2 మెయిన్స్‌పై వారంతపు పరీక్షలు నిర్వహించాలని ఫ్యాకల్టీలకు ఐటీడీఏ పీవో సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ గిరిజన సంక్షేమాధికారి ఎల్‌.రజని, అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:40 AM