Share News

ఓటరు నమోదుకు 72,386 దరఖాస్తులు

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:39 AM

ఈ ఏడాది జనవరి 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన తరువాత జిల్లాలో కొత్తగా ఓటుకోసం 72,386 మంది దరఖాస్తుచేసుకున్నారు.

ఓటరు నమోదుకు 72,386 దరఖాస్తులు

49,083 మందికి కొత్తగా ఓటు హక్కు

ఓటు బదిలీకి 17,180 దరఖాస్తులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి):

ఈ ఏడాది జనవరి 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన తరువాత జిల్లాలో కొత్తగా ఓటుకోసం 72,386 మంది దరఖాస్తుచేసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి సక్రమంగా ఉన్న 49,083 దరఖాస్తులను ఆమోదించి అధికారులు వారికి ఓటు హక్కు కల్పించారు. 12,761 దరఖాస్తులు తిరస్కరించగా మరో 10,542 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు విడుదలైన షెడ్యూల్‌ మేరకు ఈనెల 18న రాష్ట్రం లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నోటిఫికేషన్‌ విడుదలకు నాలుగు రోజులు ముందు వరకు అంటే ఈ నెల 14వతేదీ రాత్రి వరకు కొత్తగా ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించారు. అదే సమయంలో ఓటు బదిలీకి కూడా వీలు కల్పించడంతో జిల్లాలో 17,180 దరఖాస్తులు అందగా, వాటిలో సక్రమంగా ఉన్న 12,933 ఓక్షౌను ఓటర్లు కోరుకున్న చోటకు బదిలీచేయగా 2,336 దరఖాస్తులు తిరస్కరించారు. 1,908 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.

జిల్లాలో కొత్తగా ఓటరుగా నమోదుకు ఎక్కువగా విశాఖ తూర్పు నుంచి 17,252 దరఖాస్తులు రాగా అందులో 11,424 మందికి ఓటు హక్కు కల్పించారు. ఉత్తర నియోజకవర్గంలో 13,111 దరఖాస్తులందగా 8,703 మందికి, భీమిలిలో 10,170 దరఖాస్తులకు 7,131, గాజువాకలో 9,935 దరఖాస్తులకు 6,451, పెందుర్తిలో 7,691 దరఖాస్తులకు 5,641, విశాఖ దక్షిణలో 6,862 దరఖాస్తులు అందగా 5,266 మందికి ఓటు హక్కు కల్పించినట్టు అధికారులు వివరించారు.

జిల్లాకు ఇద్దరు డిప్యూటీ డీఈవోలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాల విభజన తరువాత ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక ఉప విద్యాశాఖాధికారి పోస్టు మంజూరైంది. ఇటీవల వరకు ఉప విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహించిన భీమునిపట్నం డైట్‌ లెక్చరర్‌ ఎ.గౌరీశంకరరావుకు పదోన్నతి లభించి శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. దీంతో డిప్యూటీ డీఈవో పోస్టు ఖాళీని భర్తీ చేయడానికి బదులుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజన్‌కు ఒకర్ని నియమించాలని అఽధికారులు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో విశాఖ డివిజిన్‌కు పెందుర్తి ఎంఈవో సువర్ణ, భీమిలికి చినగదిలి ఎంఈవో రవీంద్రబాబు పేర్లను పాఠశాల విద్యాశాఖకు పంపారు.

Updated Date - Apr 16 , 2024 | 01:39 AM