Share News

వి‘లేజీ’ హెల్త్‌ క్లీనిక్‌లు అద్దె భవనాలే దిక్కు

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:49 PM

ఇంటి ముంగిటికే వైద్య సేవలు తీసుకువస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు అటకెక్కాయి. నిధులు లేక, నిర్వహణకు నోచుకక పూర్తిస్థాయిలో సేవలందని పరిస్థితి నెలకొంది. ఇరుగ్గా ఉండే అద్దెభవనాల్లో అరకొర సేవల అందిస్తుండడంతో అటువైపు గ్రామీణ ప్రాంత ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా నిధులు లేక, పర్యవేక్షణకు నోచుకోక పోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిపుణులైన వైద్యులు గ్రామానికి వచ్చి ప్రజల నాడిపట్టి, రోగాన్ని గుర్తించి, మందులిస్తారని వైసీపీ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. వాటిని నమ్మిన పేద ప్రజలకు నిరాశే మిగిలింది. ఆరోగ్య సురక్ష శిబిరాలు పేరుతో రెండేళ్లుగా మొక్కుబడిగా సేవలందించి చేతులు దులుపుకొన్నారు. వైసీపీ ప్రభుత్వం దీన్ని ఓ ప్రచార ఆయుధంగా వినియోగించుకుంది. నిపుణులు లేకుండానే ఆరోగ్యకేంద్రంలో ఉన్న ఎంబీబీఎస్‌ వైద్యులతో 104 వాహనాలతో వైద్యసేవలు అందిస్తూ మమ అనిపించేవారు.

వి‘లేజీ’ హెల్త్‌ క్లీనిక్‌లు  అద్దె భవనాలే దిక్కు
అర్ధాంతరంగా నిలిచిపోయిన మర్రిపాడు హెల్త్‌ క్లినిక్‌ భవనం

(మెళియాపుట్టి)

ఇంటి ముంగిటికే వైద్య సేవలు తీసుకువస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు అటకెక్కాయి. నిధులు లేక, నిర్వహణకు నోచుకక పూర్తిస్థాయిలో సేవలందని పరిస్థితి నెలకొంది. ఇరుగ్గా ఉండే అద్దెభవనాల్లో అరకొర సేవల అందిస్తుండడంతో అటువైపు గ్రామీణ ప్రాంత ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా నిధులు లేక, పర్యవేక్షణకు నోచుకోక పోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిపుణులైన వైద్యులు గ్రామానికి వచ్చి ప్రజల నాడిపట్టి, రోగాన్ని గుర్తించి, మందులిస్తారని వైసీపీ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. వాటిని నమ్మిన పేద ప్రజలకు నిరాశే మిగిలింది. ఆరోగ్య సురక్ష శిబిరాలు పేరుతో రెండేళ్లుగా మొక్కుబడిగా సేవలందించి చేతులు దులుపుకొన్నారు. వైసీపీ ప్రభుత్వం దీన్ని ఓ ప్రచార ఆయుధంగా వినియోగించుకుంది. నిపుణులు లేకుండానే ఆరోగ్యకేంద్రంలో ఉన్న ఎంబీబీఎస్‌ వైద్యులతో 104 వాహనాలతో వైద్యసేవలు అందిస్తూ మమ అనిపించేవారు.

ఇదీ జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో 68 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో 548 హెల్త్‌క్లినిక్‌లు ఉన్నాయి. ఇందులో 85 క్లినిక్‌లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా వాటిని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 132 మంది వైద్యులు అవసరంకాగా ఇంకా 20 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీలో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తే గ్రామీణులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజిషియన్‌ పేరుతో వైసీపీ నాయకులు హడావుడి చేశారు. చిన్నపాటి పరీక్షలు చేసినా లక్షల మందికి చికిత్స చేసినట్లు ప్రచారం చేసేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పీహెచ్‌సీకి ఒకరు చొప్పున ఆరోగ్యమిత్రలు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు నిర్వహించే వారు. అయితే వారిని తొలగించడంతో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలందని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. హెల్త్‌క్లినిక్‌ల ద్వారా ప్రభుత్వం వైద్యసేవలు అందక పోవడంతో గ్రామీణులను ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:49 PM