Share News

గోడలపై రాతలు మాయం

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:55 PM

గతంలో ఎన్నికలు వచ్చాయంటే గోడ కనబడితే ప్రచార ప్రకటనలు కనిపించేవి. గోడలపై అభ్యర్థులు పేరు, పార్టీ, గుర్తు తదితర వివరాలు బొమ్మలుగా వేసే వారు. పదేళ్ల కిందటి వరకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల నాయకులు ఖాళీగా ఉన్న గోడలను రిజర్వ్‌ చేసుకునేవారు. పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడమే ఆలస్యం. వెంటనే ప్రచార రాతలతో గోడలను నింపేసే వారు. ఎన్నికల సమయంలో వివాహం వంటి శుభకార్యాలు ఉన్నా సరే ఇంటింటికి రంగు వేయిం చుకునేందుకు యజ మానులు వెనుకాడేవారు. కాలక్రమేణ గోడమీద రాతలు మాయమయ్యాయి. సోషల్‌ మీడియా పుణ్యమాని మునుపటి ప్రచారం రాతలు కనుమరుగయ్యాయి. దీంతో అప్పటిదాకా గోడమీది రాతలతో ఉపాధి పొందుతున్న కార్మికులకు కూడా పనిలేకుండా పోయింది.

-గార

Updated Date - Apr 29 , 2024 | 11:55 PM