Share News

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి: రవికుమార్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:57 PM

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలిచి రాష్ర్టాన్ని కాపాడుకోవాలని ఆమదాలవలస నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్‌ కోరారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి: రవికుమార్‌
ఆమదాలవలస: టీడీపీలో చేరిన గాజుల కొల్లివలస వైసీపీ నేతలతో రవికుమార్‌

సరుబుజ్జిలి: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలిచి రాష్ర్టాన్ని కాపాడుకోవాలని ఆమదాలవలస నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్‌ కోరారు. సోమవారం పెద్దపాలెం, పాలవలస, రావివలస, పెద్ద వెంకటాపురం, వీరమల్లిపేట, సింధువాడ, పెద్ద సవలాపురం, మూల సవలాపురం, తురకపేట, కొండ్రగూడెం, కొత్తకోట గ్రామాల్లో శంఖారావం, సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ చేతకాని పాలనతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్ప డిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన సీఎం జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను తాకట్టుపెడతాడని విమర్శించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పేడాడ సూరప్పల నాయుడు, అంబల రాంబాబు, కిల్లి సిద్ధార్థ, పల్లి సురేష్‌, తల్లాడ సురేంద్ర, రాంబాబు, సురవరపు జగదీష్‌, తాడేల రాజారావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలోకి 40 వైసీపీ కుటుంబాలు చేరిక
ఆమదాలవలస:
ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసకి చెందిన 40 వైసీపీ కుటుం బాలు టీడీపీలో చేరాయి. వీరికి కూటమి అభ్యర్థి కూన రవికుమార్‌ కండువాలు వేసి ఆహ్వానిం చారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు పొలం శ్రీను, బి.ఉమారావు, కామరెడ్డి రాము, కామరెడ్డి కృష్ణ, చీపురు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఐటీడీఏ ఏర్పాటు: గోవిందరావు
పాతపట్నం:
వైసీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలతో ఐటీడీఏను కోల్పోయామని ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. రంకిణి, బురికిపేట, బగంతర, దాసుపురం, కోడూరు, ఎగువప్రహరాజపాలెం తదితర గిరిజన గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏ లేకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారన్నారు. రానున్న కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఐటీడీఏ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిం చారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రామ్మోహన్‌ నాయుడును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సింగు పురం తదితర గ్రామాల్లోనూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లా శారద, నేతలు శివాల చిన్నయ్య, నందిగామ ఆనందరావు, సలుగు గోవిం దరావు, తూలుగు భుజంగ రావు, కరకవలస మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు క్లస్టర్‌, బూత్‌ ఇన్‌చార్జిలతో సమావేశం
పాతపట్నం:
నియోజకవర్గ టీడీపీ క్లస్టర్‌, బూత్‌ చార్జిలు, నేతలతో స్థానిక కెఎస్‌ఎం ప్లాజాలో మంగళవారం ఉదయం 9గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు హాజరుకా నున్నారన్నారు. నియోజకవర్గపరిధిలోని క్లస్టర్‌, బూత్‌ ఇన్‌చార్జిలు హాజరుకావాలని కోరారు.
అభివృద్ధి చేసి చూపిస్తా: ఎన్‌ఈఆర్‌
రణస్థలం:
తనకు ఒక అవకాశం ఇస్తే ఎచ్చెర్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఎచ్చెర్ల మం డలం అరిణాం అక్కివలస, అల్లినగరం, చిలకపాలెం, ఎచ్చెర్ల, జరజాం, ముద్దాడ, కొంగరాం, దోమాం తదితర గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య మన్నారు. ఎమ్మెల్యేగా తనకు కమలం, ఎంపీగా కలిశెట్టి అప్పల నాయుడుకు సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి, పార్టీ ఎచ్చెర్ల మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, కూటమి నేతలు గట్టెం శివరామ్‌, సంపతిరావు నాగేశ్వరరావు, గాడు రామారావు, మెండ రాజా రావు, నక్క లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 11:57 PM