Share News

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఇబ్బందులుంటే తెలపండి

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:56 PM

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని ఎన్ని కల పరిశీలకుడు సందీప్‌ శర్మ వివిధ పార్టీల నేతలను అన్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఇబ్బందులుంటే తెలపండి

టెక్కలి: సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని ఎన్ని కల పరిశీలకుడు సందీప్‌ శర్మ వివిధ పార్టీల నేతలను అన్నారు. సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యా లయంలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్ప టికే సి-విజిల్‌, సువిధ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా కూడా ఫిర్యాదు చేయ వచ్చన్నారు. రిట ర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో వలంటీర్లు ఏజెంట్లుగా ఉండరాదని, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఏజెంట్లుగా పనికిరారన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.
అభ్యర్థుల ఎన్నికల వ్యయాల నమోదు
కలెక్టరేట్‌:
పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును వారి రిజిస్టర్‌లతో సంబంధం లేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తమ రిజి స్టర్లలో పక్కాగా నమోదు చేస్తామని సాధారణ ఎన్నికల పరిశీ లకుడు శేఖర్‌ విద్యార్థి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఆయన శ్రీకాకుళం లోక్‌సభ, శ్రీకా కుళం, ఆముదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఏజెంట్లతో కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఖర్చును లెక్కి స్తామని, తమ వద్ద ఉన్న రిజిసర్లలో ఖర్చును సరిపోల్చి చూస్తా మన్నారు. తేడా ఉంటే నోటీసులు జారీ చేస్తామని, సమా వేశం లో జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో ఎం.గణపతిరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 11:56 PM