Share News

చీకటిపేటలో పోలీస్‌ పికెట్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:54 PM

ఎన్నికల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ రామచంద్రరావు హెచ్చరించారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘మమ్మల్ని ఎవర్రా ఎదిరించేది’ శీర్షికతో వచ్చిన కథనా నికి పోలీసులు స్పందించారు.

చీకటిపేటలో పోలీస్‌ పికెట్‌

రణస్థలం: ఎన్నికల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ రామచంద్రరావు హెచ్చరించారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘మమ్మల్ని ఎవర్రా ఎదిరించేది’ శీర్షికతో వచ్చిన కథనా నికి పోలీసులు స్పందించారు. ఆదివారం ఎన్‌జీఆర్‌ పురం పంచా యతీ చీకటి పేటలో గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసి కవాతు నిర్వహిం చారు. స్థానికులతో మాట్లా డారు. ఈ పంచాయతీలో అధికార పార్టీ శ్రేణులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సానుభూతిపరులపై దాడులు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు స్పందించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ అభిప్రాయాలుంటాయని, వాటిని కాలరాసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ గోవిందరావు స్పష్టం చేశారు. ప్రత్యర్థులపై దాడిచేసి హింసించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:54 PM