Share News

200 ఏళ్ల నాటి కోదండ రామాలయం

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:28 AM

శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డు లో ఉన్న కోదండ రామాలయం సు మారు 200 ఏళ్ల కిందట అల్వారు లు నిర్మించారు.

200 ఏళ్ల నాటి కోదండ రామాలయం
శ్రీరామ స్తూపం

- శ్రీరామ నవమికి ఏర్పాట్లు..

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డు లో ఉన్న కోదండ రామాలయం సు మారు 200 ఏళ్ల కిందట అల్వారు లు నిర్మించారు. 1826లో అయో ధ్య నుంచి నాటు బళ్లుపై సీతారామ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ప్రస్తుతం కోదండ రా మాలయంగా ఉన్న ఈ ప్రదేశంలో అద్దమడుగుల వెంకన్న పంతులు పేదవారికి, అనాథుల కోసం అన్నసత్రం ఏర్పాటు చేశారని, ఆయన ఆధ్వర్యంలోనే కోదండ రామాలయం నిర్మించినట్టు అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు. సుమా రు 40 ఏళ్లపాటు ఆధ్యాత్మిక వేత్త ఆరవెల్లి లక్ష్మీనారాయణాచార్యులు స్థానాచా ర్యులుగా ఉండి ఆలయాభివృద్ధికి కృషి చేశారు. ప్రస్తుతం అర్చకులు మరువాడ శ్రీనివాసాచార్యులు స్థానాచార్యుడుగా ఉన్నారు.

ప్రతిష్టాత్మకం రామకోటి స్థూపం

1941లో కోదండ రామాలయంలో కొన్నికోట్ల శ్రీరామనామంతో ఉన్న లిఖితపూ ర్వకంగా రాసిన రామకోటి పుస్తకాలను నిక్షిప్తం చేయడానికి పెద్ద జీయర్‌స్వామి శ్రీరామస్థూపాన్ని స్థాపించారు. ఇలాంటి స్థూపాలు జిల్లాలో శ్రీకూర్మం, ఆమదా లవలస, కళింగపట్నంలో ఏర్పాటు చేశారు.

నవమికి పసుపు రాట

కోదండ రామాలయంలో సోమవారం ఉదయం అర్చకులు బంకుపల్లి శేషా చార్యులు ఆధ్వర్యంలో పసుపు రాట వేసి శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభిం చారు. బుధవారం శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణం నిర్వహిం చనున్నట్టు అర్చకులు తెలిపారు. దేవాలయంలో భజనలు, పారాయణాలు, పూజలు ఉంటాయన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:28 AM