Share News

ఉచితమన్నారు కదా జగనన్నా..

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:45 PM

ఎస్సీలకు 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ ఉచితం. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్సీల సంక్షేమమే తమ ధ్యేయమంటూ సీఎం జగన్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ, చాలాచోట్ల అది అమలు కావడం లేదు. పలాస మండలంలోని ఎస్సీ కాలనీయే దీనికి ఉదాహరణ. విద్యుత్‌ ఉచితమని చెప్పడంతో ఇక్కడి ప్రజలు రెండేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పుడు సడన్‌గా అధికారులు వచ్చి మీరు రూ.వేలల్లో బకాయిలు ఉన్నారని, తక్షణమే చెల్లించాలని నోటీసులు అందిస్తుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్‌ కట్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. అదేంటి.. జగనన్నా ఉచితమన్నారు కదా అంటే.. ఆ విషయం తమకు తెలియదు పైఅధికారులతో మాట్లాడుకోండి అని విద్యుత్‌ సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండడంతోనే విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఉచితమన్నారు కదా జగనన్నా..
విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేయడానికి వచ్చిన అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న హరిజనకాలనీ ప్రజలు

ఎస్సీలకు 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ ఉచితం. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్సీల సంక్షేమమే తమ ధ్యేయమంటూ సీఎం జగన్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ, చాలాచోట్ల అది అమలు కావడం లేదు. పలాస మండలంలోని ఎస్సీ కాలనీయే దీనికి ఉదాహరణ. విద్యుత్‌ ఉచితమని చెప్పడంతో ఇక్కడి ప్రజలు రెండేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పుడు సడన్‌గా అధికారులు వచ్చి మీరు రూ.వేలల్లో బకాయిలు ఉన్నారని, తక్షణమే చెల్లించాలని నోటీసులు అందిస్తుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్‌ కట్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. అదేంటి.. జగనన్నా ఉచితమన్నారు కదా అంటే.. ఆ విషయం తమకు తెలియదు పైఅధికారులతో మాట్లాడుకోండి అని విద్యుత్‌ సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండడంతోనే విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఫ ఇప్పుడేంటి విద్యుత్‌ బిల్లులు కట్టమంటున్నారు..

ఫ పలాస ఎస్సీకాలనీ వాసుల ఆందోళన

ఫ పలువురికి నోటీసులు అందించిన అధికారులు

ఫ 200 యూనిట్ల లోపు వినియోగించిన వారికి కూడా..

ఫ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి

ఫ లేదంటే కనెక్షన్‌ కట్‌ చేస్తామని బెదిరింపు

పలాస, ఏప్రిల్‌ 28: పలాస ఎస్సీకాలనీకి చెందిన గృహ యజమానులకు విద్యుత్‌శాఖ భారీగా షాకిచ్చింది. ఒక్కో ఇంటికి రూ.1500 నుంచి రూ.10 వేల వరకూ బిల్లులు బకాయిలు ఉన్నాయని, తక్షణం వాటిని చెల్లించకపోతే విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తామని విద్యుత్‌శాఖ అధికారులు ఆదివారం కాలనీకి వెళ్లడంతో సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. పలాస ఎస్సీ వీధుల్లో మొత్తం 200కు పైగా గృహాలు ఉన్నాయి. 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్‌ అని ప్రకటించగానే వారు రెండేళ్ల నుంచి ఆ విధంగా విద్యుత్‌ను వినియోగిస్తూ బిల్లులు చెల్లించడం లేదు. అయితే నిబంధనల ప్రకారం ఉచితమే అయినా మిగిలిన యూనిట్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ లబ్ధిదారులు మాత్రం బిల్లులు చెల్లించక ఇంతకాలం మౌనం వహించారు. దీనిపై విద్యుత్‌ అధికారులు కూడా వారికి ఎటువంటి నోటీసులు గానీ, హెచ్చరికలు గానీ చేయకపోవడంతో కాలం గడిచిపోయింది. ప్రస్తుతం రెండు రోజుల నుంచి అధికారులు డి-లిస్టుల ప్రకారం విద్యుత్‌ కనెక్షన్లు తొలగించడానికి సిద్ధమయ్యారు. ఎస్సీ కాలనీల్లో అనేక మంది వినియోగదారుల బిల్లులు అపరాధ రుసుంతో సహా రావడంతో వారంతా ఖంగుతిన్నారు. రూ.వేలు బిల్లులు రావడంతో వారు ఏమిచేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. విద్యుత్‌ సిబ్బందిని ప్రశ్నిస్తే తమ పైఅధికారులకు అడిగి తెలుసుకోండని సమాధానం ఇస్తున్నారు. ఇదిలా ఉండగా మరికొంతమందికి 200 యూనిట్లకు తక్కువగా విద్యుత్‌ వినియోగించినా రూ.1600 మేరకు అపరాధ రుసుంతో కట్టాలని ఆదేశించడంతో వారు బతుకుజీవుడా అంటూ కడుతున్నారు. పెద్ద మొత్తంలో వచ్చిన వారు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల భారం ఎన్నికల సమయంలో ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కక్షసాధింపు చర్యలని కొంతమంది వాదన వినిపిస్తుండగా, మరికొంతమంది అదనంగా వినియోగించాం కనుకే బిల్లులు వచ్చాయని, అయితే విద్యుత్‌ శాఖ అధికారులే దీనికి బాధ్యత వహించాలని అంటున్నారు. రెండేళ్లుగా విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోతుంటే ఆ శాఖ అధికారులు ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు ఒక నెల విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే మారు నెల డి-లిస్టులో పెట్టి విద్యుత్‌ వైర్లు కటింగ్‌ చేసే అధికారులు పలాస ఎస్సీకాలనీలో వందల సంఖ్యలో ఇళ్లకు బిల్లులు చెల్లించకపోతే ఎందుకు పట్టించుకోలేదోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండడంతో ఉద్దేశపూర్వకంగా విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై డీఈఈ జి.ప్రసాద్‌ను వివరణ కోరగా.. రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ‘ఏ కారణంగా విద్యుత్‌ తొలగిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రజలు సంబంధిత సచివాలయాలకు వెళ్లాలి. ఆ మేరకు విద్యుత్‌ బకాయిలు చెల్లించాలి. కూడదంటే దీనిపై అప్పీలు కోరవచ్చని’ సూచించారు.

రెండేళ్లుగా అధికారులు ఏమి చేస్తున్నారు

రెండేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదని చెప్పి ప్రస్తుతం విద్యుత్‌ కనెక్షన్లు తొలగించడం తప్పు. నేను 200 యూనిట్ల కన్నా తక్కువ వినియోగిస్తున్నా నాకు నోటీసు ఇచ్చి మరీ డబ్బులు కట్టించుకున్నారు. ఈ ప్రాంతంలో అంతా దినసరికూలీలే. అధికారుల తప్పులకు అమాయకులమైన మాలాంటి వారు బలవుతున్నారు. దీనిపై విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు స్పందించాలి.

Updated Date - Apr 28 , 2024 | 11:45 PM