Share News

‘వైసీపీతో అందరికీ అన్యాయం’

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:53 PM

రాష్ట్రంలో సీఎంగా జగన్‌ అయిన తరువాత దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర సమతా సైనిక్‌దళ్‌ రాష్ట్ర కమిటీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ గొల్ల వరప్రసాద్‌ అన్నారు.

‘వైసీపీతో అందరికీ అన్యాయం’

కంచిలి: రాష్ట్రంలో సీఎంగా జగన్‌ అయిన తరువాత దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర సమతా సైనిక్‌దళ్‌ రాష్ట్ర కమిటీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ గొల్ల వరప్రసాద్‌ అన్నారు. ఆదివారం కంచిలిలో సంస్థ సమావేశం నిర్వహిం చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఔట్‌సోరింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగు నియామకాల్లో రిజర్వేషన్‌, రోస్టర్‌ విధానాన్ని పాటించలేదని, గతంలో దళితులకు ఉన్న 27 సంక్షేమ పథకాలతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీ విద్య స్కాలర్‌ షిప్‌ పథకాలను రద్దు చేసిందని విమర్శించారు. ఎస్సీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు ఎక్కువగా జరిగాయన్నారు. సైనిక్‌దళ్‌ సభ్యులు లోకేష్‌, నాగేష్‌, రావణ్‌, మర్రిపాటి పూర్ణచంద్ర పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:53 PM