Share News

ఓటు కోసం నడిచి వెళ్లే వాళ్లం

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:54 PM

ఈ ఎన్నికల్లో నేను 16వ సారి ఓటు వేయనున్నా ను. 1952లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డేపల్లి రాజగోపాలరావుకు తొ లిసారి ఓటు వేశాను. అప్పట్లో జరిగిన ఎన్నికల ప్రచా రానికి మొదట్లో నాటు బళ్లు, కొన్నాళ్ల తర్వాత విశాఖ నుంచి ఆటోలను తీసుకొచ్చి ప్రచారం చేసేవారు. మా ప్రాంతమంతా వంశధార నది అవతల ఉన్న నగరికట కం నియోజకవర్గంగా ఉండేది. నియో జకవర్గ కేంద్రాని కి చేరుకోవాలంటే ఎటువంటి వంతెన ఉండేది కాదు. నది దాటుకొని వెళ్లేవారం. నగరికటకం నియోజకవర్గం గా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన ఓటర్లంతా రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రస్తుత ఎల్‌ఎన్‌ పేట మండలంలోని సిద్దాంతం గ్రామంలో ఓటు వేయ డానికి కాలినడకన వెళ్లేవాళ్లం. కొత్త గా ఆమదాలవలస నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కూడా సిద్దాంతం గ్రామంలోనే ఓట్లు వేయాల్సి వచ్చింది.

 ఓటు కోసం  నడిచి వెళ్లే వాళ్లం

(సరుబుజ్జిలి)

-సనపల రాములు (102), పెద్దమతలబుపేట, సరుబుజ్జిలి

Updated Date - Apr 29 , 2024 | 11:54 PM