Share News

ఎన్నికల గుర్తులు ఎలా వచ్చాయంటే..

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:50 PM

భారతదేశంలో 1952లో జరిగిన తొలి ఎన్నికల సమ యానికి అక్షరాస్యత 16 శాతమే ఉండేది. దీంతో ఓటర్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను గుర్తించడం కష్టతరం కాబట్టి సులభంగా గుర్తించేందుకు వీలుగా బ్యాలెట్‌ పత్రంలో గుర్తులను ఉంచాలని నిర్ణయించారు. ఇందుకుగాను 1950లో ప్రముఖ చిత్రకారుడు ఎంఎస్‌ సేధి తో పెన్సిల్‌తో చిత్రాలను గీయించి... వాటిలో గుర్తులను ఎన్నికల బ్యాలెట్‌ పత్రంలో ఉపయోగించుకున్నారు. అలా వివిధ రకాలుగా ఆధునికతను సంతరించుకుని ఎన్నికల గుర్తులు రూపొందాయి. ఎంఎస్‌ సేధి 2000వ సంవత్సరం లో కన్ను మూశారు. ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల కమి షన్‌ గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు వారు ఎంచుకున్న గుర్తులను కేటాయించేది. వివి ధ రాజకీయ పార్టీల తరుపున బీ-ఫారం సమర్పించి... పో టీ చేసే వారికి ఆ పార్టీ గుర్తులను కేటాయించారు. ఈవీ ఎంలు వచ్చాక గుర్తులతో పాటు అభ్యర్థి పేరు, ఫొటోతో పాటు కేటాయించిన గుర్తును అందుబాటులో ఉంచారు.

ఎన్నికల గుర్తులు  ఎలా వచ్చాయంటే..

(నరసన్నపేట)

Updated Date - Apr 28 , 2024 | 11:50 PM