Share News

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులు

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:59 PM

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడాలని ఎంపీ కింజరాపు రామ్మో హన్‌ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు.

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులు
అరసవల్లి: రోడ్‌షో నిర్వహిస్తున ్న కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రామ్మోహన్‌, గొండు శంకర్‌

అరసవల్లి: ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడాలని ఎంపీ కింజరాపు రామ్మో హన్‌ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ ఆధ్వర్యంలో నగర పరిధిలోని 3 డివిజన్లలో సోమవారం రోడ్‌ షో నిర్వహించారు. పాత బస్టాండు వద్ద ప్రారంభమైన రోడ్డు షో 7 రోడ్ల కూడలి, గుజరాతీపేట, రెల్లి వీధి, పాలకొండ రోడ్డు, రిమ్స్‌, బలగ కుమ్మరివీధి, బలగ మెట్టు వరకు సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం ద్వారా మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతి, జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, టీడీపీ డివిజన్‌ ఇన్‌చార్జిలు, పెద్ద ఎత్తున ఉమ్మడి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
న్యాయవాదులను కలిసిన కూటమి అభ్యర్థులు
కూటమి లక్ష్యాన్ని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి విజయానికి సహకరిం చాలని ఎంపీ, ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, గొండు శంకర్‌ కోరారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ భవనంలో న్యాయ వాదులను కలిసి కూటమి లక్ష్యాలను వారికి వివరించారు.
అరాచక పాలనకు అంతం పలకాలి: బగ్గు
జలుమూరు (సారవకోట): గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ అరాచక పాలనకు రానున్న ఎన్నికల్లో ఓటుతో అంతం పలకాలని నరసన్నపేట ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి అన్నారు. ధర్మలక్ష్మీపురంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్సు పథకాలను వివరించారు. ఈ సదర్భంగా మాట్లాడుతూ.. అమరావతి రాష్ట్ర రాజధానిగా చేసి రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కూటమి తరపున పోటీ చేస్తున్న తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా రామ్మోహన్‌ నాయుడులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, సాధు కృష్ణారావు, చల్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేట: టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణ మూర్తి ఆరోపించారు. సోమవారం పట్టణంలో హడ్కో, ఇందిరానగర్‌ కాలనీల్లో ప్రచారం నిర్వహిం చారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడును సీఎంగా చేయాలన్నారు. అనంతరం హడ్కో కాలనీలో బూర్జ రమణ తదితర 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
జలుమూరు: శ్రీముఖలింగం పంచాయతీకి చెందిన ఆరుగురు గ్రామ వలంటీర్లు టీడీపీలో చేరారు. ఆదివారం రాత్రి సవరడ్డపనస పార్టీ కార్యాలయంలో వీరికి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, అసెంబ్లీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి కండువాలు వేసి ఆహ్వానించారు. సర్పంచ్‌ తమ్మన్నగారి సతీష్‌కుమార్‌ నేతృత్వంలో చింతాడ ప్రసాద్‌, మజ్జి మాధవరావు యండ నారాయణరావు, బొంగు నాగార్జున, సూర శ్రీనాథ్‌, పల్లి అప్పన్న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 11:59 PM