Share News

సూపర్‌సిక్స్‌ పథకాలతో అభివృద్ధి: గోవిందరావు

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:57 PM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం సాధ్యమని ఉమ్మడి పార్టీ అభ్యర్థి మామిడి గోవింద రావు అన్నారు.

సూపర్‌సిక్స్‌ పథకాలతో అభివృద్ధి: గోవిందరావు
కొత్తూరు: పొన్నుటూరులో టీడీపీలో చేరిన వైసీపీ నేతలతో గోవిందరావు

యంబరాం(ఎల్‌.ఎన్‌.పేట): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం సాధ్యమని ఉమ్మడి పార్టీ అభ్యర్థి మామిడి గోవింద రావు అన్నారు. ఆదివారం యంబరాం, బొడ్డవలస తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. సీఎం జగన్‌ ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా నిర్వీర్యమైం దన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో తనకు సైకిల్‌ గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వి.గోవిందరావు, కె.కృష్ణమాచారి, సీహెచ్‌ శ్రీనివాసరావు, ఎన్‌.నారాయణరావు, గోవిందరావు పాల్గొన్నారు.
కొత్తూరు: రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయమని పాతపట్నం కూటమి టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. పొన్ను టూరు గ్రామంలో సర్పంచ్‌ ఎద్దు చామంతితో వార్డు మెంబర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గోవిందరావు కండు వాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచా యతీల నిధులను మళ్లించి నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి అభ్యర్థు లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లోతుగెడ్డ తులసీ వరప్రసాద్‌, ఎద్దు సంతోష్‌, అగతముడి మాధ వరావు, మాతల గాంధీ, చీకటి వీర్రాజు, దాసునాయు డు, పైల బాబ్జీ, తాతబాబు తదితరులున్నారు. కలిగాం సర్పంచ్‌ సనపల కోటేశ్వరరావుతో పాటు 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి ఉమ్మడి అభ్యర్థి గోవిందరావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి: ఎన్‌ఈఆర్‌
జి.సిగడాం:
రాష్ట్రంలో కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు. ఆదివారం దవళపేట, సంతవురిటి, పాలఖండ్యాం, టీడీవలస, నక్కపేట, గెదెలపేట, సీతంపేట, మెట్టవలస, గొబ్బూరు. వెంకయ్యపేట, జగన్నాఽథవలస, వాండ్రంగి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాండ్రంగిలో వైసీపీ మండల మాజీ అధ్య క్షుడు బూరాడ వెంకటరమణ, సర్పంచ్‌ సాకేటి నాగరాజు, ఎంపీటీసీ సభ్యురాలు బూరాడ శ్రీదేవి, ఉప చర్పంచ్‌ డబ్బాడ రామారావు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సుమారు 300 కుటుం బాల వారు టీడీపీలో చేరారు. వీరికి కూటమి అభ్యర్థి ఎన్‌ఈఆర్‌ కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని, ఎమ్మెల్యేగా తనకు కమలం, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడుకు సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కూటమి నేతలు కుమరాపు రవిమార్‌, వజ్జపర్తి రఘురాం, మీసాల రవికుమార్‌, గుణాకరరావు, ఎండమూరి శ్రీనివాసరావు, టి.మౌళీశ్వరరావు, బెవర జగన్నాఽథరావు, కామోజుల సీతారాం, కుదిరెళ్ల బుజ్జి, బూపతి అర్జున్‌ కుమార్‌, కంచరాన సూరన్నాయుడు, బి.వెంకటేశ్వరారవు, మహాదాశ్యం చిన్నారావు, బెవర బాలానందం పాల్గొన్నారు.
రణస్థలం: కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నడుకుదిటి ఈశ్వర రావు, కలిశెట్టి అప్పల నాయుడులను గెలిపించాలని కోరుతూ ఎన్‌ఈఆర్‌ సతీమణి నడుకుదిటి రజని ఎచ్చెర్ల మండలం కొంగరాం, చినకొంగరాం తదితర గ్రామాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కొంగరాం మాజీ సర్పంచ్‌ నక్క లక్ష్మణరావు, గోపిన కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంతో మేలు: రవికుమార్‌
బూర్జ: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆమదాలవలస కూటమి అభ్యర్థి కూన రవికుమార్‌ అన్నారు. అల్లెన, తుడ్డలి, లక్కుపురం, పాలవలస, రామన్నపేటల్లో ఆదివారం ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరిం చారు. సీఎం జగన్‌ చేతకాని పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్‌, కూటమి నాయకులు మొదలవలస రమేష్‌, ఆనెపు రామకృష్ణంనాయుడు, అంపిలి గణపతిరావు, వి.రాంజీ, కృష్ణ, సత్య ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
పొందూరు: మండలంలో ధర్మపురం, వీఆర్‌గూడెం గ్రామాల నుంచి 70 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి ఏఎంసీ మాజీ చైర్మన్‌ అన్నెపు రాము, సువ్వారి మధు ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ కండువా కప్పి ఆహ్వా నించారు. ధర్మపురం నుంచి 40, వీఆర్‌ గూడెం నుంచి 30 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకు న్నాయి. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామ్మోహన్‌, నేతలు బలగ శంకరభాస్కర్‌, బి.గిరి, వి.మురళి తదితరులు ఉన్నారు.
ఆమదాలవలస: అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తు టీడీపీతోనే సాధ్యమని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు మెట్ట సుజాత అన్నారు. ఆదివారం నిమ్మ తొర్లాడ, పాతూరు, సిరింపేట, వెదుళ్లవలస, గొల్లపేట, నెల్లిపర్తి గ్రామాల్లో ప్రచారం చేశారు. రానున్న ఎన్ని కల్లో ఆమదాలవలస ఎమ్మెల్యేగా కూన రవికుమార్‌ను, ఎంపీగా కింజరాపు రామ్మోహన్‌ నాయు డులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు నూకరాజు, తమ్మినేని చంద్రశేఖర్‌, సనపల ఢిల్లీశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:57 PM