Share News

వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:04 AM

శ్రీకాకుళం మునిసిపల్‌ మాజీ చైర్మన్‌.. దివంగత నేత అంధవరపు వరాహనరసింహం (వరం) కుటుంబ సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి టీడీ పీలో చేరారు. ఆదివారం గుజరాతీపేటలో భారీ ర్యాలీగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌కు వరం కుమార్తె, మాజీ చైర్‌పర్సన్‌ పైడి శెట్టి జయంతి, కుమారులు ప్రసాద్‌, సంతోష్‌ తదితరులు 500 కుటుంబాలతో స్వాగతం పలికి టీడీపీ తీర్థం పుచ్చు కున్నారు.

వైసీపీకి భారీ షాక్‌
గజమాలతో ఎంపీ రామ్మోహన్‌, ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్‌కు స్వాగతం పలికిన వరం కుటుంబ సభ్యులు

- టీడీపీలోకి వరం కుటుంబ సభ్యులు

- ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల సమక్షంలో చేరిక

అరసవల్లి, ఏప్రిల్‌ 28: శ్రీకాకుళం మునిసిపల్‌ మాజీ చైర్మన్‌.. దివంగత నేత అంధవరపు వరాహనరసింహం (వరం) కుటుంబ సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి టీడీ పీలో చేరారు. ఆదివారం గుజరాతీపేటలో భారీ ర్యాలీగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌కు వరం కుమార్తె, మాజీ చైర్‌పర్సన్‌ పైడి శెట్టి జయంతి, కుమారులు ప్రసాద్‌, సంతోష్‌ తదితరులు 500 కుటుంబాలతో స్వాగతం పలికి టీడీపీ తీర్థం పుచ్చు కున్నారు. దీంతో శ్రీకాకుళం పట్టణంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలినట్లయింది. వీరికి ఎంపీ రామ్మోహన్‌ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ.. ఇంత భారీ సంఖ్యలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, గతంలో స్వర్గీయ ఎర్రన్నాయుడు.. వరంగారితో కలిసి పనిచేశారన్నారు. గుజరాతీపేట టీడీపీకి కంచు కోటగా ఉండేదని, మళ్లీ ఇప్పుడు అదే స్థితికి రావడం సం తోషమన్నారు. పార్టీలో కష్టించి పనిచేసే వారికి తప్పని సరిగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ చేరికతో గుజరాతీపేటలో వైసీపీ కనుమరుగైపోయింద న్నారు. మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ.. తన తండ్రి దివంగత నేత వరం ఆశయా లను కొనసాగించేందుకు గుజరాతీపేట ప్రజల మద్దతుతో టీడీపీలో చేరినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేగా గొండు శంకర్‌ను అత్య ధిక మెజార్టీతో గెలిపిద్దామన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు బోయిన గోవిందరాజులు, నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, నేతలు పీవీ రమ ణ, కొర్ను నాగార్జున ప్రతాప్‌, పైడిశెట్టి బెనర్జీ, జామి భీమ శంకర్‌, కరగాన భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:04 AM