Share News

వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:26 AM

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని వాస్‌ సోదరుడు శ్రీకాంత్‌, ఆయన సతీ మణి కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జయశ్రీ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరారు.

వైసీపీకి భారీ షాక్‌
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన దువ్వాడ శ్రీకాంత్‌, జయశ్రీ

- ఎమ్మెల్సీ దువ్వాడ సోదరుడు రాజీనామా.. టీడీపీలో చేరిక

- శ్రీకాంత్‌ సతీమణి కూడా..

పలాస, ఏప్రిల్‌ 15: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని వాస్‌ సోదరుడు శ్రీకాంత్‌, ఆయన సతీ మణి కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జయశ్రీ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరారు. సోమవారం ఉదయం పలాసలో వారి స్వగృహంలో విలేకరులతో దువ్వాడ శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. తాము ఎందుకు పార్టీకి రాజీనామా చేయా ల్సి వచ్చిందో వివరించారు. కాంగ్రెస్‌కు జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేసిన వెం టనే తాను మొదటిసారిగా జిల్లా నుంచి ఆయనకు మద్దతు పలికానని గుర్తు చేశా రు. ‘గ్రామస్థాయి నుంచి పట్టణం వరకూ మంత్రి అప్పలరాజుకు పరిచ యం చేసిన వ్యక్తిని నేను. నన్ను మూడేళ్లుగా తొక్కే ప్రయత్నం చేశారు. పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ ఒక్క కార్యక్రమానికి కూడా ఆహ్వానించ లేదు. నా ఆవేదనను అర్థం చేసుకుని జిల్లా నాయకులు నాకు పూర్తి మద్దతు పలికారు. నా భార్య జయశ్రీకి 2020లో కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవిని తమ్మినేని సీతారామ్‌ ఇప్చించారు. ఆయనకు కృతజ్ఞతలు. అయితే ఒక్క సమావేశానికి కూడా ఆహ్వానం అందలేదు. మా దంపతులకు జరిగిన అన్యాయానికి నిరసన గా పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నామ’ని దువ్వాడ శ్రీకాంత్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. సీనియర్‌ నాయకుడైన దువ్వాడ శ్రీకాంత్‌ రాజీనామా ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Updated Date - Apr 16 , 2024 | 12:26 AM