Share News

పెద్దలు చెప్పిన వారికే ఓటు వేసేవాళ్లం

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:47 PM

ఓట్ల ఎలచ్చన్‌ తొలిరోజుల నుంచి ఓటు వేయడం నాకు ఎరుక. అప్పట్లో ఓట్లు అంటే ఊళ్లో అంతా కలిసిమెలిసి ఉండే వాళ్లు. వాళ్లు ఎవరికి చెబితే వాళ్లకే ఓట్లు వేసేవాళ్లం. ఈరోజుల్లో ఉండే విధంగా అప్పట్లో గొళ్లు గొడవలు ఉండేవి కావు. పొక్క చిక్కుడు మాట్లల్లేవ్‌. డబ్బులు ఇవ్వడం ఎరగం. నిజాయితీగా ఇంట్లో పెద్దలు చెప్పిన విధంగా ఓట్లు వేసేవాళ్లం. మా ఊరు నుంచి వెళ్లి ముమ్మారు నరసన్నపేటలో ఓటు వేశాం. ఇనమారు పోలాకి వెళ్లి ఓట్లు వేశాం. ఓట్లు వేయడానికి మూడు నుంచి ఏడు కిలోమీటర్లు వరకు నడిచే వెళ్లేవాళ్లం. పెద్దలు చెప్పిన వారికి ఓటు వేయడానికి అంత కష్టపడే వాళ్లం. ఇప్పుడు రోజులు మారాయి. ఎలచ్చన్‌ వచ్చిందంటే గొడవలు.. గొళ్లు చూస్తున్నాను.

 పెద్దలు చెప్పిన   వారికే ఓటు వేసేవాళ్లం

నరసన్నపేట: ఓట్ల ఎలచ్చన్‌ తొలిరోజుల నుంచి ఓటు వేయడం నాకు ఎరుక. అప్పట్లో ఓట్లు అంటే ఊళ్లో అంతా కలిసిమెలిసి ఉండే వాళ్లు. వాళ్లు ఎవరికి చెబితే వాళ్లకే ఓట్లు వేసేవాళ్లం. ఈరోజుల్లో ఉండే విధంగా అప్పట్లో గొళ్లు గొడవలు ఉండేవి కావు. పొక్క చిక్కుడు మాట్లల్లేవ్‌. డబ్బులు ఇవ్వడం ఎరగం. నిజాయితీగా ఇంట్లో పెద్దలు చెప్పిన విధంగా ఓట్లు వేసేవాళ్లం. మా ఊరు నుంచి వెళ్లి ముమ్మారు నరసన్నపేటలో ఓటు వేశాం. ఇనమారు పోలాకి వెళ్లి ఓట్లు వేశాం. ఓట్లు వేయడానికి మూడు నుంచి ఏడు కిలోమీటర్లు వరకు నడిచే వెళ్లేవాళ్లం. పెద్దలు చెప్పిన వారికి ఓటు వేయడానికి అంత కష్టపడే వాళ్లం. ఇప్పుడు రోజులు మారాయి. ఎలచ్చన్‌ వచ్చిందంటే గొడవలు.. గొళ్లు చూస్తున్నాను.

-వెలమల నీలమ్మ (102), జమ్మూ గ్రామం, నరసన్నపేట మండలం

Updated Date - Apr 28 , 2024 | 11:47 PM