Share News

ఓటుతో వైసీపీని తరిమేయండి

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:25 PM

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించడంతోపాటు కార్పొరేషన్‌ రుణాలను రద్దు చేసి దళిత యువతకు ఉపాధి లేకుండా చేసిన జగన్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ ప్రజలకు పిలుపు నిచ్చారు.

ఓటుతో వైసీపీని తరిమేయండి
కొంగపాడులో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి

సబ్‌ప్లాన్‌ నిధులు దారమళ్లించి ..కార్పొరేషన్‌ రుణాలు రద్దు చేసి..

దళిత యువతకు ఉపాధి లేకుండా చేసిన జగన్‌

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి

అద్దంకి, ఏప్రిల్‌ 28 : వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించడంతోపాటు కార్పొరేషన్‌ రుణాలను రద్దు చేసి దళిత యువతకు ఉపాధి లేకుండా చేసిన జగన్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ ప్రజలకు పిలుపు నిచ్చారు. మండలంలోని కొంగపాడులో రవికుమార్‌ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ సూపర్‌సిక్స్‌ పథకాలతో కలిగే ప్రయోజనాలను వివరించారు. వైసీపీ 2019 మ్యానిపెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తుందన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదని, మెగా డిఎస్సీ మాటే లేదని, ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు చేయలేదని, మద్య నిషేధం ఊసేలేదని అన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇంకా పూర్తి కాలేదన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్‌ రాజధాని లేకుండా చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తామన్నారు. ఎస్సీ కాలనీలో గొట్టిపాటి ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. టీడీపీ నేతలు నాగినేని రామకృష్ణ, కరి పరమేష్‌, సందిరెడ్డి శ్రీనివాసరావు, నర్రా బ్రహ్మానందం, కరి సుబ్బారావు, మాచవరపు సుబ్బారావు, చిరంజీవి, శ్రీనివాసరావు, కమ్మ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అద్దంకి పట్టణంలోని 14వ వార్డులో ఎమ్మెల్యే రవికుమార్‌ ఆదివారం రా త్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయరన్నారు. పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు జహీరా, విజయలక్ష్మి, అత్తులూరి రమేష్‌, సుభాషిణి, కంపా రజనీ, మాగులూరి తిరుపతమ్మ, తేజశ్వని, మాజీ ఎంపీపీ మన్నెం ఏడుకొండలు, టీ డీపీ నేతలు కుందారపు రామారావు, శ్రీనివాసరావు, కాసా పుల్లయ్య,, గుడివిల్‌ హనుమంతరావు పాల్గొన్నారు.

టీడీపీ రాగానే రూ.4వేల పింఛన్‌

బల్లికురవ, ఏప్రిల్‌ 28 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మెదటి నెల నుంచే వృద్ధులకు రూ.4వేల పింఛన్‌ అందిస్తారని యువనేత గొట్టిపాటి కమల్‌కిషోర్‌ (బాబీ) తెలిపారు. మండలంలోని ఎస్‌ఎల్‌ గుడిపా డు గ్రామంలో ఆదివారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్దిపాటి రవికుమార్‌కు మద్దతుగా బాబీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అయన ఇంటింటికీ తిరిగి టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందుకు జగన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రూ.3 వేల పింఛన్‌ ఇస్తానని వృద్ధులను మోసం చేశారన్నారు. ఒక్కసారి ఇవ్వంకుండా విడతలుగా ఐదేళ్లవరకూ సాగదీశారన్నారు. ఒక్కచాన్స్‌తో మోసం చేసిన జగన్‌రెడ్డి మాటలను, వైసీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మొద్దన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటిని, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్‌ను సైకిల్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని బాబీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రావులపల్లి గోవిందు, సంపతిశౌరి, ఆలకుంట యర్రంనాయుడు, సుబ్బారావు, శ్రీను, వెంకటేశ్వర్లు, జ్యోతి ప్రసాద్‌, సాంబయ్య పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన రెండు గ్రామాల వైసీపీ నేతలు

అద్దంకి మండలంలో వైసీపీకి పట్టు ఉన్న గ్రామాలైన రామాయపాలెం, విప్పర్లవారిపాలెంలో పలువురు వైసీపీ నేతలు, ఆపార్టీ సానుభూతిపరులు ఎమ్మెల్యే రవికుమార్‌ సమక్షంలో ఆదివారం జొన్నతాళి వద్ద క్యాంప్‌ కార్యాలయంలో సైకిలెక్కారు. విప్పర్లవారిపాలెం సర్పంచ్‌ బొనిగల శాంతమ్మ, విజయబాబు, మోషే, బూసాల వెంకటేశ్వర్లు, ప్రభాకరరావు, జ్యోతి ఆదినారాయణ, శేషయ్య, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, ఎలీజా, తుని బాబురావు, అంజయ్య, చిరంజీవి, మాలతి, ప్రేమ్‌కుమార్‌, డేవిడ్‌, రవికుమార్‌, అంజయ్య, ఏడుకొండలు, గోపి, తేజతో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీ డీపీలో చేరారు. రామాయపాలెం మాజీ సర్పంచ్‌ కుమారుడు, వైసీపీ నేత వేములపాటి రాజశేఖరరెడ్డి, చెంచురెడ్డి, పుల్లారెడ్డి, ఏడుకొండలు, గురునాథరావు, అబ్రహం, ఏసోబు, రావులపల్లి అంకమ్మ, శివయ్యతో పాటు 20 కుటుంబాలు వైసీపీని వీడి సైకిలెక్కారు.

Updated Date - Apr 28 , 2024 | 11:25 PM