Share News

ఎన్నికల సిబ్బందికి రెమ్యునరేషన్‌ నామమాత్రం

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:53 PM

వచ్చే నెల 13న జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బందికి గత ఎన్నికలకు చెల్లించిన నామమాత్రపు రెమ్యునరేషన్‌ ఇప్పుడు కూడా చెల్లించనున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు నియమితులైన అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన రెమ్యూనరేషన్‌ మొత్తాలనే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విధులకు నియమితులైన వారికి చెల్లించనున్నారు.

ఎన్నికల సిబ్బందికి   రెమ్యునరేషన్‌ నామమాత్రం

ఐదేళ్ల క్రితం ఎన్నికలకు ఇచ్చేందే ఇప్పుడు కూడా

పెంచాలని కోరుతున్న ఉద్యోగులు

ఒంగోలు(విద్య), ఏప్రిల్‌ 29 : వచ్చే నెల 13న జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బందికి గత ఎన్నికలకు చెల్లించిన నామమాత్రపు రెమ్యునరేషన్‌ ఇప్పుడు కూడా చెల్లించనున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు నియమితులైన అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన రెమ్యూనరేషన్‌ మొత్తాలనే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విధులకు నియమితులైన వారికి చెల్లించనున్నారు. అంటే ఐదేళ్ల క్రితం చెల్లించిన రెమ్యూనరేషన్‌నే ప్రస్తుతం కూడా చెల్లించనున్నారు. ఈమేరకు ఎన్నికల కమిషన్‌ ఈ నెల 27న ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధులకు సెక్టార్‌ ఆఫీసరు కాకుండా అదనంగా నియమితులయ్యే జోనల్‌ మేజిస్ట్రేట్‌కు ఏకమొత్తంగా రూ.1500 చెల్లిస్తారు.

ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అండ్‌ కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌కు రోజుకు రూ.350

నాల్గో తరగతి ఉద్యోగులకు రోజుకు రూ.200

వీడియో సర్వేలెన్స్‌ టీమ్‌కు ఏకమొత్తంగా రూ.1200

వీడియో వ్యూయింగ్‌ టీమ్‌, అకౌంటింగ్‌ టీంకు ఏకమొత్తంగా రూ.1000

కంట్రోల్‌ రూమ్‌, కాల్‌సెంటర్‌ స్టాఫ్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటికి రోజుకు రూ.200

సెక్టోరల్‌ ఆఫీసర్‌కు రూ.5000, మాస్టర్‌ ట్రైనర్‌కు రూ.2000, అసిస్టెంట్‌ ఎక్స్‌పెండిచర్‌ అబ్జర్వర్‌కు రూ.7500 ఏకమొత్తంగా చెల్లిస్తారు.

ఆదాయ పన్ను ఇన్‌స్పెక్టర్‌కు ఏకమొత్తంగా రూ.1200

మైక్రో అబ్జర్వర్‌కు ఏక మొత్తంగా రూ.100 చెల్లిస్తారు.

పోలింగ్‌ విధులకు నియమితులయ్యే వారికి పోలింగ్‌ రోజున ఫ్యాక్డ్‌లంచ్‌, రిఫ్రె్‌షమెంట్స్‌కు, పోలీసు సిబ్బందికి, మొబైల్‌ పార్టీ సిబ్బందికి, హోంగార్డులకు, ఫారెస్టు గార్డులకు, గ్రామ రక్షకదళ, ఎన్‌సీసీ క్యాడెట్లకు మాజీ సైనిక ఉద్యోగులు, వలంటీర్లకు ఫ్యాక్డ్‌ లంచ్‌ లేదా రూ.150 నగదు చెల్లిస్తారు. ఎన్నికల్లో పోలింగ్‌ విధులకు, ఓట్ల లెక్కింపు విధులకు నియమితులైన వారికి రెమ్యూనరేషన్‌తో పాటు లంచ్‌కు రూ.150 చెల్లిస్తారు. అర్హత మేరకు డీఏ చెల్లిస్తారు.

ఉద్యోగుల పెదవి విరుపు

ఎంత కష్టతరమైన పోలింగ్‌ విధులకు నియమితులైన ఉద్యోగులకు నామమాత్రపు రెమ్యూనరేషన్‌ చెల్లింపునకు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఉద్యోగులు పెదవివిరుస్తున్నారు. ఒంగోలులో పనిచేస్తున్న వారిని సుమారు 200 కిలోమీటర్ల దూరంగా గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాలకు కేటాయించారు. అంతదూరం వెళ్లి విధులు నిర్వహించి రావాలంటే కనీసం వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంఈవోలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, బ్యాంకు మేనేజర్లను పీవో, ఏపీవోలుగా నియమించారు. ఎన్నికల సిబ్బంది రెమ్యూనరేషన్‌ విషయంలో ఎన్నికల కమిషన్‌ పునరాలోచించి రెమ్యూనరేషన్‌ పెంచుతూ తాజా ఉత్తర్వులు సవరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 10:53 PM