Share News

‘సన్‌’డే

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:24 AM

సూరీడు చెలరేగిపోతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నానికి మంటపుట్టిస్తున్నాడు. ఆదివారం మోతాదు మరింత పెంచాడు.

‘సన్‌’డే

మార్కాపురం, కంభంలలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత

అనేక మండలాల్లో 43 డిగ్రీలపైనే నమోదు

పెరిగిన వడగాడ్పుల తీవ్రత 8 వృద్ధులు విలవిల

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 28 : సూరీడు చెలరేగిపోతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నానికి మంటపుట్టిస్తున్నాడు. ఆదివారం మోతాదు మరింత పెంచాడు. దీంతో జిల్లాలోని పశ్చిమప్రాంతం నిప్పుల కుంపటిలా మారింది. మార్కాపురం, కంభం, అర్ధవీడుల్లో 44.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అది అనేక మండలాల్లో 43 డిగ్రీలకుపైనే ఉంది. ఎర్రగొండపాలెంలో 44.3, దొనకొండలో 44.2, హనుమంతునిపాడులో 44.1, గిద్దలూరులో 44.1, కనిగిరిలో 44.0, పెద్దార వీడులో 44.0, తర్లుబా డులో 43.8, వెలిగండ్లలో 43.9 డిగ్రీల ఎండ కాచింది. పీసీపల్లిలో 43.6, కొమరోలులో 43.5, పొదిలిలో 43.4, చీమకుర్తిలో 43.4, దోర్నాలలో 43.3, సీఎస్‌పురంలో 43.2, కొనకనమిట్లలో 43.2, బేస్తవారపేటలో 42.9, ముండ్లమూరులో 43.7, కురిచేడులో 43.2, పొన్నలూరులో 43.2, మర్రిపూడిలో 43.0, కొత్తపట్నంలో 42.9, మద్దిపాడులో 41.2, సంతనూతలపాడులో 41.1, ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన అనేక మండలాల్లో అది 40 డిగ్రీలపైనే ఉంది. ఒంగోలులో 39.7 డిగ్రీలు నమోదైంది. ఎండకు తోడు వడగాడ్పుల తీవ్రత కూడా పెరగడంతో వృద్ధులు, చిన్నారులు విలవిల్లాడారు.

Updated Date - Apr 29 , 2024 | 01:25 AM