Share News

మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాం

ABN , Publish Date - May 05 , 2024 | 02:22 AM

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి

మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాం

కొనకనమిట్ల, మే 4 : టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి తీరుతామని ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని సిద్ధవరం, చినారికట్ల, పెదారికట్ల, గ్రామాల్లో శనివారం విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వెలుగొండ శ్రీవెంకటే శ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం ప్రచారం ప్రారంభించారు. పశ్చిమ ప్రకాశం అభివృ ద్ధికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి తీరుతామన్నారు. దీంతో ఈ ప్రాంత వ్యాపారులు రైతులు అభివృద్ధి చెందుతారన్నారు. యువతకు ఉద్యోగాలు విరివిగా వచ్చే అవకాశం ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహిళ లకు ఉచిత బస్సుప్రయాణం కల్పించనున్నట్లు పేర్కొన్నా రు. రైతుల పెట్టుబడి నిధికింద ఏడాదికి రూ.20వేలు, మహిళకు నెలకు రూ.1500, సంవత్సరానికి మూడు గ్యాస్‌సిలెండర్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ రక్షణ చట్టంలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉమ్మడి పార్టీ అమలు చేయనున్నట్లు తెలిపారు. కనుక ఉమ్మడి అభ్యర్థులు కందుల నారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డిలకు రానున్న ఎన్నికలలో సైకిల్‌ గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా వాగుమడుగు గ్రామంలో ఇంటింటికి ప్రజా గళం కార్యక్రమాన్ని కందుల కుమార్తె నందినిరెడ్డి నిర్వ హించారు. ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్ర మంలో కొనకనమి ట్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

30 కుటుంబాలు టీడీపీలో చేరిక

మండలంలోని సిద్ధవరం గ్రామంలో వైసీపీ నుంచి 30 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో శనివారం టీడీపీలో చేరాయి. గ్రామంలోని ఎంపీటీసీ మాజీ సభ్యుడు బారా ఇమామ్‌ ఆయన అనుచరులు నలమూరి మోహన్‌రావు, మరో 12 కుటుంబాల వారు, పద్మశాలిలు 15 కుటుంబాలు, విశ్వబ్రహ్మణులు రెండు కుటుంబాలు, టీడీపీలో చేరాయి. టీడీపీకి మద్దతుగా నిలువనున్నట్లు వారు తెలిపారు.

పొదిలి : మండలంలోని జువ్వలేరు గ్రామంలో ఇంటిం టికి మన కందుల కార్యక్రమాన్ని కందుల తనయుడు విఘ్నేష్‌రెడ్డి నిర్వహించారు. అదేవిధంగా పొదిలి పట్టణంలో 11వ వార్డులో కందుల సోదరి లక్ష్మీ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా విఘ్నేష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలందరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. జనసేన, బీజేపీలు బలపరిచిన ఉమ్మడి మార్కాపురం టీడీపీ అభ్యర్ధిగా కందుల నారాయణరెడ్డి, పార్లమెంట్‌ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసరెడ్డిలు పోటి చేస్తున్నారని తెలిపారు. కనుక వారిని సైకిల్‌ గుర్తపై మీపవిత్రమైన ఓటును వేసి వేయించేందుకు ప్రతి ఒక్కరు అలుపెరుగని కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలు, యువత జీవితాలు బాగుండాలంటే టీడీపి గెలుపుతోపాటు చంద్రబాబునాయుడు పాలన రావాలన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలో ఉందన్నారు. అభివృద్ది కనుచూపు మేరలో కనబడటం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్దితోపాటు సూపర్‌సిక్స్‌ పధకాలను చంద్రబాబునాయుడు ప్రజలకు అంధించనున్నట్లు చెప్పారు. కనుక రాష్ట్రం అభివృద్ది పధంలో నడవాలంటే చంద్రబాబునాయుడి పాలన రావాలని ఆయన కోరారు. చంద్రబాబుతోనే రాష్ట్రానికి, యువతకు భరోసా ఉంటుందన్నారు. కనుక ఒంగోలు ఎంపీ అభ్యర్ధిని, మార్కాపురం అసెంబ్లీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు. జువ్వలేరు గ్రామం నుండి 20 వైసీపీ కుటుంబాలు విఠి్నేష్‌రెడ్డి సమక్షంలో టీడపీ తీర్ధం పుచ్చుకున్నారు. టీడీపీ గెలుపుకు కృషిచేయాలని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిదంగా కొష్టాలపల్లి గ్రామం నుండి కందుల సమక్షంలో 5 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువాలు వేసి కందుల నారాయణరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో జువ్వలేరు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పొదిలి : మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన విద్యాకమిటీ చైర్మన్‌ రెడ్డెబోయిన నరసింహారావు తన అనుచరులతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. శనివారం మార్కాపురం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో చేరారు. పార్టీలో చేరినవారు రెడ్డెబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, యరముడి చిన్నసుబ్బారావు, యరముడి సుబ్బయ్యలతోపాటు మరికొంత మంది టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారిని కందుల నారాయణరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ గెలుపుకోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన సూచించారు. వీరితోపాటు టీడీపీ గ్రామ నాయకులు వెంకట్రావ్‌ యాదవ్‌, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డిలు ఉన్నారు.

Updated Date - May 05 , 2024 | 02:22 AM