Share News

ఆర్‌అండ్‌బీ సిబ్బంది నిర్వాకం

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:53 PM

మండలంలోని జువ్విగుంట సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడాయి. ఉధృతంగా వీస్తున్నగాలులకు కారుచిచ్చులా మంటలు ధర్మవరం బస్టాండ్‌ వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదం కారణంగా రహదారిపక్కనే ఉన్న నిమ్మతోటకు మంటలు వ్యాపించాయి. సుమారు 50చెట్లకుపైగా పూర్తిగా కాలిపోయాయి. ఈమంటల్లో నిమ్మతోటకు ఏర్పాటు చేసిన పైపులు, స్ల్పింక్లర్లు కాలి బూడిద అయ్యాయని బాధితుడు మేదరమిట్ల చలపతిరావు వాపోయాడు. నాలుగు లక్షలకుపైగా నష్టం వాటిల్లిందన్నారు. పక్కనే ఉన్న మిరపతోటకు ఏర్పాటు చేసిన పైపులు, పట్టలు కాలిపోవడంతో 50వేల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని కౌలురైతు ఎనిమిరెడ్డి చెంచిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్‌అండ్‌బీ సిబ్బంది నిర్వాకం
జువ్విగుంటలో అగ్నికి ఆహుతి అవుతున్న నిమ్మతోట

టంగుటూరు - పొదిలి రహదారిలోఎగిసిన అగ్ని కీలలు

కాలిపోయిన నిమ్మతోట

అగ్నికి ఆహుతిఅయిన స్ల్పింక్లర్లు, పైపులు

ఐదులక్షల మేరకు ఆస్తినష్టం

మర్రిపూడి, ఏప్రిల్‌ 28 : మండలంలోని జువ్విగుంట సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడాయి. ఉధృతంగా వీస్తున్నగాలులకు కారుచిచ్చులా మంటలు ధర్మవరం బస్టాండ్‌ వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదం కారణంగా రహదారిపక్కనే ఉన్న నిమ్మతోటకు మంటలు వ్యాపించాయి. సుమారు 50చెట్లకుపైగా పూర్తిగా కాలిపోయాయి. ఈమంటల్లో నిమ్మతోటకు ఏర్పాటు చేసిన పైపులు, స్ల్పింక్లర్లు కాలి బూడిద అయ్యాయని బాధితుడు మేదరమిట్ల చలపతిరావు వాపోయాడు. నాలుగు లక్షలకుపైగా నష్టం వాటిల్లిందన్నారు. పక్కనే ఉన్న మిరపతోటకు ఏర్పాటు చేసిన పైపులు, పట్టలు కాలిపోవడంతో 50వేల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని కౌలురైతు ఎనిమిరెడ్డి చెంచిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులుగా ఆర్‌అండ్‌బీ సిబ్బంది రోడ్డుపక్కన మొలిచిన గడ్డిని, చెట్లను నిర్మూలించేందుకు నిప్పు పెడుతున్నట్లు సమాచారం. వారి నిర్వాకం వల్లనే మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ధర్మవరం సమీపంలో అగ్నికీలలు ఎగిసిపడటంతో 50 మూగజీవాలు మంటల్లో చిక్కుకోవడంతో కాపరులు వాటిని సురక్షితంగా కాపాడగలిగారు. ఈదశలో సమీపంలో ఉన్న వ్యవసాయబోరు నుంచి మంటలను ఆర్పేందుకు అన్నదాతలు తీవ్రంగా శ్రమించారు. రోడ్డుపై మంటలు చెలరేగడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఒకవైౖపు కరువు తీవ్రతతో చెట్లను కాపాడుంటున్నప్పటికీ అగ్నిప్రమాదం కారణంగా పసిపిల్లల్లా పెంచుకున్న చెట్లు కాలిపోవడంతో నష్టపోయాయనని అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:53 PM