Share News

ప్రభుత్వ బదిలీ టీచర్ల జీతాలకు లైన్‌క్లియర్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:23 AM

జిల్లాలో గత ఏడా ది ప్రభుత్వం ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది ఇతర పాఠశాలలకు వెళ్లి పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపునకు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయింది.

ప్రభుత్వ బదిలీ టీచర్ల జీతాలకు లైన్‌క్లియర్‌

తొమ్మిది నెలలుగా నిలిపివేత

ఎట్టకేలకు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ

ఒంగోలు(విద్య), ఏప్రిల్‌ 28 : జిల్లాలో గత ఏడా ది ప్రభుత్వం ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది ఇతర పాఠశాలలకు వెళ్లి పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపునకు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయింది. దీంతో తొమ్మిది నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట లభిం చింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో గత ఏడాది జూన్‌లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. ఆ సమయంలో దూర ప్రాంతాలకు బదిలీ అయిన వారు దగ్గర ప్రాంతాలకు వచ్చేందుకు ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తలొగ్గిన విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వీరి బది లీలకు మౌఖికంగా టెలిఫోన్‌ ఆదేశాలు ఇచ్చారు. టీచర్ల పేర్లు, వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటు, బదిలీ కోరుకుంటున్న స్కూల్‌ పేరుతో పాఠశాల విద్య కమిషనర్‌ డీఈవోలకు ఎక్సెల్‌ షీట్‌లో వాట్సప్‌ సందేశం పంపారు. దీంతో విధిలేక డీఈవోలు ఆ టీచర్లకు వారు కోరుకున్న స్థానాలకు బదిలీ ఉత్త ర్వులు ఇచ్చారు. అలా రాష్ట్రవ్యాప్తంగా 652 మంది హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు లభిం చాయి. వారిలో మన జిల్లాలో 34 మంది ఉన్నారు. అయితే ఈ ఉత్తర్వుల ఆధారంగా జీతాలు చెల్లించేందుకు ఖజానాశాఖ అధికారులు ససేమిరా అన్నారు. ఈ బదిలీలకు అధికారికంగా ఎలాంటి ఆధారం లేదని, ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటేనే జీతాలు చెల్లిస్తామని భీష్మిం చారు. ఫిబ్రవరి నాటికి ఆరు నెలల జీతాలు రాక పోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను ‘ఆంధ్రజ్యోతి’లో ‘టీచర్ల ఆకలి కేకలు’ అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత అన్ని జిల్లాల డీఈవోలు జీతాలు రాని టీచర్ల ఇబ్బందులను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జోక్యంతో వీరికి జీతాలు చెల్లించేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతూ ఈనెల 10న ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఖజనా అధికారులను సమన్వయం చేసుకొని వెంటనే జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ఈనెల 18న డీఈవోలను ప్రవీణ్‌ప్రకాష్‌ ఆదేశించారు.

Updated Date - Apr 29 , 2024 | 01:23 AM